Kandula Durgesh: సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నాం

Read Time:  1 min
Kandula Durgesh: సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నాం
FONT SIZE
GET APP

రాష్ట్రంలో త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (AP) పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన ‘కృష్ణాతీరం కవితాహారం’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

Read Also: Maharashtra: రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

Kandula Durgesh: సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నాం
We are putting the cultural sector back on track.

గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు (Kandula Durgesh) తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఇక, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే చర్చించామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈతరం కవులు సమర్పించిన కవితా హారతిగా ఈ కార్యక్రమం నిలిచిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 51 మంది కవులు కవితలు వినిపించడంతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.