📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Kakinada: 48 గంటల్లోనే బాలిక మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 6:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు రోజుల క్రితం కాకినాడలో జరిగిన జనసేన సభలో భావోద్వేగభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. “సాయం చేయ్ పవన్ అన్నా” అంటూ ప్లకార్డులు పట్టుకుని ఓ తల్లి, తండ్రి తన కుమార్తె కనిపించకపోవడంపై పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించారు. 20 రోజులుగా మిస్ అయిన బాలిక కోసం వారు ఎన్నోచోట్ల తిరిగి చివరకు జనసేన అధినేత దృష్టికి తీసుకు వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం రాకపోవడంతో నిరాశ చెందిన వారు చివరకు ప్రజా వేదికను ఆశ్రయించారు.పైగా పవన్ దృష్టికి చేరిన 48 గంటల్లో(48 Hours) నే పోలీసులు కేసును చేధించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న జనాలు, నిరసన తెలిపితే గాని పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తివివరాలు

బాధిత మార్వాడి కుటుంబం సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కరప గ్రామానికి వచ్చి సెటిల్ అయ్యారు. వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే జూన్ 8వ తారీఖున తమ పద్నాలుగేళ్ల కుమార్తె కనపించకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసి రెండు వారాలపైనే అవుతున్నా తమ బిడ్డ ఆచూకీ గుర్తించలేదు.దీంతో విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు, తమ కుమార్తను కాపాడమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సహాయం కోరారు. ఆయనను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తున్నారని తెలుసుకుని తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు.

Kakinada:

తమకు అతడిపైనే అనుమానంగా ఉందని

ఇందుకోసం ముందుగా,విమానాశ్రయం వద్ద, ఆ తర్వాత సభలో కూడా ప్లకార్డులను ప్రదర్శించి, తమకు సాయం చేయాలని కోరారు. ‘పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదు, 20 రోజులవుతున్నా మాకు ఇంకా న్యాయం జరగలేదు సాయం చేయన్నా’ అంటూ వేడుకున్నారు.తమ బిడ్డ కనిపించకుండా పోయినప్పటి నుంచి తమ పక్కింట్లో ఉండే 23 ఏళ్ల యువకుడు కూడా కనిపించడం లేదని తమకు అతడిపైనే అనుమానంగా ఉందని తెలిపారు. పోలీసులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని కనీసం డిప్యూటీ సీఎం (Deputy CM) ను కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు వారి నిరసన ఫలించి 48 గంటల్లోనే వారి బిడ్డ ఆచూకీని గుర్తించారు పోలీసులు.

Read Also: Andhra Pradesh: మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ

#GirlFoundSafe #JusticeForTheGirl #KakinadaIncident #MissingGirlCase Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.