Kakinada: లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి

Read Time:  1 min
Kakinada: లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
FONT SIZE
GET APP

Kakinada: లండన్‌లో (UK) అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన అభిషేక్‌ (28) ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం లండన్‌ వెళ్లాడు. అక్కడ ఎంబీఏ (MBA) పూర్తి చేసిన అనంతరం, అక్కడే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. చేతికి అందిన కొడుకు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.

Read Also: Pulivendula: నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు

Kakinada: లండన్‌లో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
Kakinada: Fire accident in London.. Telugu youth dies

ప్రాణాలు కోల్పోయిన అభిషేక్

లండన్‌లో జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదంలో అభిషేక్ చిక్కుకుపోయినట్లు ఈ ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు మరణ వార్త విన్న పెద్దాపురంలోని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.