📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

KA Paul: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం వల్లే ప్రవీణ్ చనిపోయారంటూ సీసీ కెమెరాల ఫుటేజీతో సహా పోలీసులు చెబుతున్నా… క్రైస్తవ సంఘాలు ఈ ఘటనపై ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ప్రవీణ్ ను హత్య చేసి చంపేశారని పిటిషన్ లో కేఏ పాల్ ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్: పాల్
మరోవైపు పక్కా ప్రణాళికతోనే ప్రవీణ్ ను హత్య చేశారని పాల్ తన వాదనలు వినిపించారు. పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ ఫొటోలని వాదించారు. మృతి ఘటనపై ఎవరూ మాట్లడవద్దని స్థానిక ఎస్పీ అందరినీ బెదిరించారని చెప్పారు. ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదని అన్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టును ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మృతిని రోడ్డు ప్రమాదంగా పోలీసులు ప్రకటించిన తర్వాత… సీబీఐ విచారణ కోసం హైకోర్టును కేఏ పాల్ ఆశ్రయించడం గమనార్హం.కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనక పక్కా కుట్ర ఉందని పాల్ ఆరోపించారు. ప్రభుత్వం కోర్టుకు తెలిపిన ప్రకారం, వీధిలో జరిగిన ప్రమాదం వల్లే ప్రవీణ్ మృతి చెందారు. అప్పటి నుండి పోలీసులు వీడియో ఆధారాలు, సాక్ష్యాలు చూపిస్తున్నారు. ప్రవీణ్‌కు మద్యం అలవాటు లేదు కానీ వదంతులు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Read Also: Sai Reddy: సాయిరెడ్డికే రాజ్య సభ అవకాశాలపై చర్చలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu High Court's key orders KA Paul's petition Latest News in Telugu on Pastor Praveen's death Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.