Jitendra Singh: డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనం

Read Time:  1 min
Jitendra Singh: డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి చంద్రబాబే నిలువెత్తు నిదర్శనం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన దార్శనికుడు అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ (Jitendra Singh) అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన “డబుల్ ఇంజిన్” ప్రభుత్వ విధానానికి ఆయన అసలైన నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎల్లుండి గురించి మాత్రమే కాదు, రేపటి కోసం కూడా కలలు కనేవారు అని మంత్రి అన్నారు..

Read Also: Bolisetty Satyanarayana: జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు

Jitendra Singh: Chandrababu Naidu is a testament to the double engine government
Jitendra Singh: Chandrababu Naidu is a testament to the double engine government

చంద్రబాబే సరైన ఉదాహరణ

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక భవన నిర్మాణానికి కాదని, భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు పునాది అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ (Jitendra Singh) మాట్లాడుతూ.. చంద్రబాబు ముందుచూపు, పాలనా వేగాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. “హైదరాబాద్‌లో అంతర్జాతీయ వైద్య సదస్సు నిర్వహించడానికి సరైన వేదిక లేనప్పుడు, హైటెక్ సిటీలోని కన్వెన్షన్ హాల్ గురించి తెలిసింది.

అప్పుడే చంద్రబాబు దార్శనికత మాకు పరిచయమైంది. ఇప్పుడు ఏపీలో మరోసారి అదే వేగాన్ని చూస్తున్నాం. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ సైన్సెస్ ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం కొన్ని నెలల్లోనే అన్ని అనుమతులు లభించాయి. గత శనివారమే ఆ కేంద్రాన్ని జాతికి అంకితం చేశాం. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో చెప్పడానికి చంద్రబాబే సరైన ఉదాహరణ” అని ఆయన వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.