📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jahnavi: టైటాన్ స్పేస్ మిషన్‌కు ఎంపికైన దండేటి జాహ్నవి

Author Icon By Anusha
Updated: June 24, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతరిక్షంలోకి వెళ్లడం అంటే ఎన్నో శారీరక, మానసిక పరీక్షలు దాటి వెళ్లే అరుదైన అవకాశం. అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేయబోతున్నది మన తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి అనే 23 ఏళ్ల తెలుగమ్మాయి అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఆమె అమెరికా అంతరిక్ష పరిశోధ సంస్థ నాసా, ప్రయివేట్ వాణిజ్య సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) సంయుక్తంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో వ్యోమగామిగా పాల్గొననుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలవనుంది. 2029 మార్చిలో ఆమె అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ ఐదు గంటలపాటు గడపనుంది.అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష యాత్రను చేపడుతోంది. ఈ యాత్ర కోసం జాహ్నవిని వ్యోమగామిగా (ASCA) ఎంపిక చేశారు. భారత్‌లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న ఏ మహిళ కూడా ఇంతకు ముందు నేరుగా అంతరిక్షయానానికి ఎంపిక కాలేదు.

కొద్దిమంది పరిశోధకులను

ఇప్పుడు జాహ్నవి ఆ ఘనత సాధించింది. టైటాన్ స్పేస్ సంస్థ నిర్వహించిన పరీక్షలన్నిటిలో ప్రతిభ చూపిన జాహ్నవి అంతరిక్ష యాత్ర అర్హత సాధించింది. టైటాన్ స్పేస్ రోదసీలో ఒక పెద్ద అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో ఇది అంతరిక్ష ప్రయోగాలకు, వ్యాపారానికి, పర్యాటకానికి కేంద్రంగా మారుతుంది. ఇక, భారతీయ వ్యోమగామి శుభాాన్షు శుక్లా సైతం ఆక్జియమ్ మిషన్‌లో భాగంగా త్వరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Center) వెళ్లనున్నారు.ఈ యాత్రలో మొదట కొద్దిమంది పరిశోధకులను, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్తారు. 2029 మార్చిలో మొదటి యాత్ర జరుగుతుంది. అందులో జాహ్నవి భారతదేశం నుంచి పాల్గొంటుంది. ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో ఉంటుంది. దీనికి ఎంపికైన వారికి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

రికార్డు సృష్టించింది

జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్’కు భారతదేశం తరఫున ఎంపికై రికార్డు సృష్టించింది. ఆ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ, ‘కువైట్‌లో తన తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీలు ఉద్యోగం చేస్తున్నారు. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను. మా అమ్మమ్మ లీలావతి (Leela Vathi)చందమామ కథలు చెప్పేది. దీంతో నేను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్ని అని చెప్పింది. చిన్నప్పటి నుంచి ఆమెకు అంతరిక్షంపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ స్థాయికి చేర్చింది.

Jahnavi

విద్యార్థులతో మమేకమయ్యారు

అయితే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రేరణ కలిగించే ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇచ్చిన జాహ్నవి, నిట్‌లతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థలలోని విద్యార్థులతో మమేకమయ్యారు. అనలాగ్ మిషన్లు, డీప్-సీ డైవింగ్, ఖగోళ శాస్త్రం, అంతరిక్షంలో దీర్ఘకాలిక జీవన సామర్థ్యంపై జరిగే అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటున్నారు. జాహ్నవి, అంతర్జాతీయ ఖగోళ శోధన సహకార సంస్థ (IASC) తో కలిసి Pan-STARRS టెలిస్కోప్ ఆధారంగా ఒక అస్టరాయిడ్‌ను తాత్కాలికంగా గుర్తించారు. ఆమె అంతర్జాతీయ స్థాయిలో స్పేస్ ఐస్‌లాండ్ నిర్వహించిన జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగానే కాదు, తక్కువ వయసులో ఎంపికైన విదేశీ అస్ట్రోనాట్‌గానూ గుర్తింపు పొందారు.

ఎంతోమంది యువతీయువకులు

తెలుగు ప్రజలుగా మనకు ఇది ఎంతో గర్వించదగిన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంతరిక్షానికి చేరుతున్న తొలి మహిళగా జాహ్నవి నిలిచారు. ఇంతటి ఘనత సాధించడం సాధారణ విషయం కాదు. ఈమె కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రతి యువతికి ఆదర్శంగా నిలుస్తుంది.ఈ కథ సాక్షాత్కారంగా చూస్తే, మనం ఎంత కష్టపడితే ఏదైనా సాధ్యమే అనే విషయం అర్థమవుతుంది. జాహ్నవి (Dangeti Jahnavi) ని చూసి ఎంతోమంది యువతీయువకులు స్పేస్, సైన్స్ రంగాలపట్ల ఆసక్తి కనబర్చే అవకాశం ఉంది. ఆమె మార్గం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.దంగేటి జాహ్నవి సాధించిన ఈ ఘనత, దేశం పేరు మారుమ్రోగేలా చేస్తోంది. తన కలను నిజం చేసుకున్న జాహ్నవి ఇప్పుడు కోట్లాది మంది యువత కలలకు వేదికగా మారింది. తెలుగమ్మాయి అంతరిక్షంలో అడుగుపెడతుందంటే – అది గర్వంగా కాకపోతే ఇంకేమిటి.

Read Also: Iran: మీకు తెలుసా! ఇరాన్ తొలి సుప్రీం లీడర్ మూలాలు భారత్‌లో..

#FirstIndianWomanInSpace #IndianAstronaut #JahnaviDangeti #NASA #ProudMoment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.