మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం తన పర్యటనపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ధరల్లేక, పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. గుంటూరు మార్కెట్ యార్డులో రైతులను పరామర్శించాననీ, పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని ట్వీట్ చేశారు. ఈ కారణంగా ప్రజలనుద్దేశించి పూర్తిగా మాట్లాడలేకపోయానంటూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్ వేదికగా కోరారు.
మిర్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబుకు జగన్ ట్వీట్
By
Vanipushpa
Updated: February 19, 2025 • 3:59 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.