YCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు వి. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకున్న సంబంధాలపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తనను మళ్లీ వైసీపీలోకి ఆహ్వానించరని, ఒకవేళ ఆయనే స్వయంగా పిలిచినా తిరిగి వెళ్లే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి జగన్‌కు అత్యంత సన్నిహితంగా, ఆర్థిక వ్యవహారాల్లోనూ నమ్మకమైన భాగస్వామిగా ఉన్న సాయిరెడ్డి, తన రాజకీయ నిర్ణయం వెనుక ఉన్న అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. జగన్ తన సేవలను ఉపయోగించుకొని పక్కన పెట్టేశారని ఆరోపించిన ఆయన, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : తల్లికి వందనం రెండో విడత నిధులపై బిగ్ అప్‌డేట్

రాజీనామాకు కారణాలైన ‘అవమానాలు’
ఢిల్లీ పరిణామాలు, సజ్జల నియామకంపై తీవ్ర అసంతృప్తిపార్టీకి, పదవులకు గుడ్ బై చెప్పడానికి గల రెండు ప్రధాన కారణాలను విజయసాయిరెడ్డి వివరిస్తూ అధినేత జగన్ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్‌ల వ్యవహారాలను ఎంపీగా ఉన్న తన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) పర్యవేక్షిస్తారని జగన్ ప్రధాని వద్దే చెప్పడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. ఇక 2024లో తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండానే సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించడం తనకు జరిగిన తీరని అవమానంగా భావించానని పేర్కొన్నారు. ఈ రకమైన ప్రాధాన్యతల కోత, అవమానాల వల్లే తాను వైసీపీకి శాశ్వతంగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సాయిరెడ్డి వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :