हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పోసాని భార్య కు జగన్ పరామర్శ

Anusha
పోసాని భార్య కు జగన్ పరామర్శ

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని పై చర్యలు తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, అరెస్ట్ చేసి, అనంతరం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 353 (2), 111 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జగన్ స్పందన.

పోసాని అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఆమెను ధైర్యం చేయిస్తూ, “దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అందరం తోడు ఉంటాం” అని తెలిపారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు పోసానికి మద్దతుగా ఉండాలని సూచించారని సమాచారం. పార్టీ నాయకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని సహా పలువురిని కోర్టు వద్దకు పంపించామని జగన్ వెల్లడించారు.

కేసు వివరాలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత జోగిమణి ఫిర్యాదు చేయగా, ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. పోలీసులు ఐపీసీసెక్షన్లు 196, 353 (2), రెడ్ విత్ 3 (5) కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై పోసాని తన వాదన సమర్పించనున్నారని సమాచారం.

jaganposani

పోసాని అరెస్ట్ తో రాష్ట్రంలో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జనసేన, టీడీపీ శ్రేణులు ఈ అరెస్ట్ ను సమర్థిస్తుండగా, వైసీపీ నేతలు దీనిని ఖండిస్తున్నారు.గతంలో ఎన్నడూ ఇలాంటి వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు వ్యవహరించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఈ కేసు రాజకీయంగా మరిన్ని ముద్రలు వేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ మార్పు తర్వాత జనసేన అధికారం చేపట్టిన వేళ, పవన్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా పోసానిపై చర్యలు తీసుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఇది కేవలం న్యాయపరమైన చర్య మాత్రమేనని అధికారపక్షం పేర్కొంటోంది.వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేసినందుకు కూడా ఆయనపై కేసు నమోదయింది.  

 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870