📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ABV: శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

Author Icon By Vanipushpa
Updated: June 3, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్(Ex CM Jagan) పై విజయవాడలో జరిగింది రాయి దాడి కానే కాదని, అది కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన కట్టుకథ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswararao) సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని, అమాయకుడైన వడ్డెర కులానికి చెందిన సతీశ్(Satish) అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, మనుషుల జీవితాలతో చెలగాటమాడే నైజం జగన్‌దని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

ABV: శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు..
ఏబీ వెంకటేశ్వరరావు నేడు విజయవాడలో ‘రాయి దాడి’ కేసులో నిందితుడిగా చిత్రికరించబడి, 45 రోజుల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపిన సతీశ్‌ను, అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏబీవీ మాట్లాడుతూ, “గజమాల వేసినప్పుడు తగిలిన చిన్న గాయాన్ని ఉద్దేశపూర్వకంగా రాయి దాడిగా చిత్రీకరించి, సానుభూతి పొంది, రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. దీనికోసం ఏ పాపం తెలియని ఒక నిరుపేద వడ్డెర యువకుడిని, అతని కుటుంబాన్ని బలిపశువును చేశారు. ఇది రాయి దాడి కాదు, ఒక వడ్డెర బిడ్డ జీవితాన్ని జగన్ నాశనం చేసిన ఉదంతం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సతీశ్‌పై థర్డ్ డిగ్రీ
“ప్రభుత్వం మారినా, ఆ దుర్మార్గపు కేసును ఇప్పటికీ కొట్టివేయకుండా తిప్పుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారు. సతీశ్‌పై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ చిత్రహింసల గురించి వింటే గుండె తరుక్కుపోతుంది. ఆ యువకుడు ఇప్పటికీ తన చేత్తో అన్నం కూడా తినలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. ఇంతటి ఘోరానికి పాల్పడిన పోలీసు అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీని ద్వారా సమాజానికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బాధితులు చేసిన తప్పేంటి? ఈ కేసుతో వారికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా, ఎలాంటి సాక్ష్యం లేకపోయినా ఎందుకు ఇంతలా వేధించాలి?” అని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి
ఈ అమానుష ఘటనలో అమాయకులను బలిపశువులను చేసిన బాధ్యులైన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం, డీజీపీ, పోలీస్ కమిషనర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సతీశ్‌పై బనాయించిన అక్రమ కేసును వెంటనే మూసివేయాలని, బెయిల్ బాండ్స్‌ను రద్దు చేసి, వారు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా, ప్రభుత్వం బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి, వారి జీవితాలకు భరోసా కల్పించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ ఘటన జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలకు నిదర్శనమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Andhra: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు

#ABV #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Jagan is a person Latest News in Telugu on dead bodies Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today who does politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.