విజయవాడ Inquiry : ఏపీ లిక్కర్ కేసులో (AP liquor case) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని సిట్ విచారణ రావాలని ఆదేశించింది. లిక్కరు స్కామ్ కేసులో సిట్ దూకుడు ప్రదర్శింస్తూంది. నిందితులను ఒక్కొక్కరిగా బయటకు లాగుతుంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో రాయణ స్వామిని విచారణకు రావాలని సిట్ అధికారులు కోరినట్లు తెలిపారు. లిక్కరు స్కామ్కు సంబంధించి ఆయన కీలక సాక్షిగా ఉండారని గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య కారణాలతో విచారణకు గైర్హాజరు కాలేనని చెప్పడంతో వర్చువల్గా సిట్ విచారినట్లు సమాచారం. ఇక శుక్రవారం నారాయణ స్వామిని సిట్ మరో పర్యాయం ఆయన ఇంట్లోనే వర్చువల్గా విచారించింది. దాదాపు ఆయన ఆరుగుంటల పాటు విచారించిన సిట్ నారాయణస్వామిని మరోసారి విజయవాడలో విచారిస్తామని తెలిపి నట్లు సమాచారం, అయితే తాజా విచారణ తరువాత ఆయనను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని కథనం ప్రచారంలోకి వచ్చింది. ఎందుకనో సిట్ ఆయనను వర్చువల్ గానే విచారించింది.

SIT దర్యాప్తు వేగం – రాజ్ కెసిరెడ్డి ఆస్తుల సీజ్‌కు అనుమతి
ఈ క్రమంలో ఎక్సైజ్ పాలసీలో మార్పుల వెనుక ఉన్నవారి పాత్రపై సిట్ విచారణ చేయనున్న అధికారులు. లిక్కర్ పాలసీ ఆమోదానికి సంబంధించి ఆరాతీయనున్నట్లు సమాచారం. కాగా, లిక్కర్ కేసులో నారాయణ స్వామి పాత్ర కూడా కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి చెందిన మరిన్ని విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కెసిరెడ్డి సహా పలువురు నిందితులు, పలు సంస్థలకు చెందిన రూ.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోల ద్వారా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. మరో రూ.13 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతులు జారీ చేసింది. గత ప్రభుత్వహయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలు చోట్లతన కుటుంబసభ్యులు, బంధువుల పేరిట రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. వీటిని సీజ్ చేసేందుకు అనుమతించాలని సీఐడీ రాష్ట్రప్రభు త్వాన్ని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. కేసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :