Vijayawada: రాష్ట్రంలో ఆదాయం (Income) వృద్ధి గణనీయంగా పెంచే దిశలో కీలక కార్యచరణ చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. జాతీయవృద్ధితో పొల్చుకుంటే ఇప్పటికే మన గ్రోత్ ఐదున్నర 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్టీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై చంద్రబాబు (Chandrababu) అధికారులతో చర్చించారు. ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. రుణాలు తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటివి అత్యంత కీలక అంశాలని చంద్రబాబు వివరించారు. వనరుల సమీకరణలో రాష్ట్ర సొంత ఆదాయం(Income), కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పని చేయాలని ఆదేశించారు.
ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమీక్ష
ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ప్రామాణిక సమాచారాన్ని రూపొందించుకోవాలన్నారు. ఈ దిశగా ప్రణాళిక పనితీరు మెరుగు పరుచుకోవాలని చంద్రబాబు (Chandrababu) చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కెబినెట్ సమావేశాలు, 25 ఎస్ఐఐబీపీ సమావేశాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడితో ఆగకుండా.. ఆ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఏపీ సచివాలయంలో ప్లానింగ్ శాఖ ఏపీ ఎకానమీ, గ్రోత్ డ్రైవర్స్, జీఎస్టీపీ ప్రొజెక్షన్స్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్లపై సీఎం చంద్రబాబు సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ 2024- 25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయికిమించి ఏపీ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఈ మేరకు అధికారులు తమ నివేదికలో వివరించారన్నారు. దీనిపై వారి నుంచి స్పష్టతను సీఎం చంద్రబాబు కోరారు. 2024- 25కు జాతీయ స్థాయిలో సరాసరి తలసరి ఆదాయం 8.7 శాతంగా ఉంటే.. ఏపీ 11.89 శాతం నమోదు చేసిందని తెలిపిన అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు, ఇది సంతృప్తికర అంశమైనప్పటికి మరింతగా తలసరి ఆదాయం, జీఎస్టీపీ, రాష్ట్రాదాయాలు ఎలా పెరుగుతాయనే అంశంపై మనం దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకు తగినట్లు అంచనాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
Read also: Vangalapudi Anitha: యోగా నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు – మంత్రి అనిత