ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రాంతానికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అమరావతికి ఒక ప్రత్యేకమైన కేబుల్ బ్రిడ్జి(Cable bridge) ప్లాన్ చేశారు.అమరావతిని విజయవాడ – హైదరాబాద్ నేషనల్ హైవేను కలిపేలా అడుగులు ముందుకుపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే వారికి ఒక స్వాగత ద్వారంలా ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు దూరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. ఏడీసీఎల్ సంస్థ(ADCL company) సర్వే చేసి సలహా సంస్థను ఎంపిక చేసే పనిలో ఉంది.
ప్రభుత్వం
ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఏడీసీఎల్ సంస్థ సలహాదారుని ఎంపిక కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇప్పుడు సాంకేతిక బిడ్ల మదింపు జరుగుతోంది. ఆ తరువాత ఫైనాన్షియల్ బిడ్ల(Financial bids)ను పరిశీలీంచిన తర్వాత కన్సల్టెంట్‌ను ఎంపిక చేస్తారు. ఈ బ్రిడ్జి పూర్తయితే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చే వారికి సరికొత్త అనుభూతిలా ఉంటుంది అంటున్నారు. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా నదికి అవతల నేషనల్ హైవేపైఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల పొడవునా కేబుల్ బ్రిడ్జి ప్లాన్ చేశారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి కోసం నికి శంకుస్థాపనకూడా చేసింది. రూ. 1,387 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఎన్10 నుంచి పవిత్ర సంగమం వరకు నిర్మించాలని భావించారు.
అనుసంధానం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,2019లో ఆగిపోయిన ఈ బ్రిడ్జి,తాజాగా పాత ప్రతిపాదనను మార్చి కొత్తగా ప్రతిపాదనలు చేశారు.పశ్చిమ బైపాస్ రావడంతో ఈ మార్పులు చేశారు. అమరావతిలో ప్లాన్ ప్రకారం.రాజధానిలోని ముఖ్యమైన రోడ్లు ఎన్6, ఎన్13 లను హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేలకు లింక్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఎన్6 రోడ్డు అనుసంధానం ముగింపు దశకు రాగా ఈ రోడ్డుపై ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) చేపట్టిన పశ్చిమ బైపాస్ ఆరు లైన్ల పనులు పూర్తికావొచ్చాయి. దీనికి అదనంగా ఎన్13 రోడ్డును ఎన్‌హెచ్65తో లింక్ చేస్తారు.
Read Also: TTD: తిరుమల భద్రత పై ఉన్నతస్థాయి సమావేశం