📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Andhra Pradesh: ఆంధ్రాలో పేదలకు ఇళ్ల స్థలాలు

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు స్థలం ఇస్తారు. గతంలోనే పేదల ఇళ్లకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ముందుగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని సిబ్బంది వాటిని పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ ద్వారా సహాయం అందుతుంది. ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేస్తున్నా ఇప్పటికీ చాలామందికి దీని గురించి అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదు,దీంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఆంధ్రాలో పేదలకు ఇళ్ల స్థలాలు

వివరాలు

ఇళ్లకు సంబంధించి సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత ఉన్నవారు అక్కడికి వెళ్లి వివరాలు ఇస్తే వాటిని వీఆర్వో లాగిన్‌కు పంపుతారు. అనంతరం రెవెన్యూ అధికారులు పత్రాలను పరిశీలించి, స్థలం మంజూరు చేయడానికి సిఫార్సు చేస్తారు. అంతేకాదు వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు. పట్టణాల్లో రూ.2.50 లక్షలు ఇస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో(In rural areas) ఎంత ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాల్లో ఇప్పటి వరకు ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టలేదు,వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.మధ్యలో ఆగిపోయిన ఇళ్లను కేటగిరీలుగా విభజించి, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అదనంగా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అర్హత ఉండి సొంత ఇల్లు లేని పేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని,ఈ మేరకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు ఆదేశించారు.ఈ పథకానికి సంబంధించి నిబంధనలు ఇలా ఉన్నాయి.బీపీఎల్‌ కేటగిరీ (పేదలు) వారు ఈ పథకానికి అర్హులు. తెల్ల రేషన్‌కార్డు(White ration card)తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇంటి స్థలం ఉండకూడదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సొంత స్థలం కూడా ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ పథకాల్లో లబ్ధి పొందకూడదు,ఐదెకరాల మెట్టు లేదా 2.50 ఎకరాల మాగాణి మించకూడదు అనే రూల్స్ ఉన్నాయి. ఈ పథకానికి సంబంధించి సిఫార్సులు అవసరం లేదని నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి సరైన పత్రాలు అందజేస్తే ఆరు దశల పరిశీలన ఉంటుందంటున్నారు అధికారులు. అధికారులు ఆదాయ వివరాలు, భూములు, సొంత ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డు వంటి నిబంధనల్ని పరిశీలిస్తారు. ఆరు దశల పరిశీలన తర్వాత అర్హులైతే ఇల్లు మంజూరవుతుంది. ఈ మేరకు పేదల ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల్లో అవగాహన కల్పించే పనిలో ఉన్నారు అధికారులు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు

#AndhraPradesh #APHousingScheme #GraminHousing #HousingForPoor #WelfareInitiative Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.