हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Hima Bindu: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ‘మీడియేషన్ ఫర్ ది నేషన్’ క్యాంపైన్

Anusha
Hima Bindu: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ‘మీడియేషన్ ఫర్ ది నేషన్’ క్యాంపైన్

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బి.ఎస్.వి.హిమబిందు

విజయవాడ : దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఈ నెల 1 వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బి. ఎస్.వి.హిమబిందు విజప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5 వ తేదీన నిర్వహించే 2 వ జాతీయ లోక్ అథాలత్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలన ఆమె కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం దగ్గర్లోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంపైన్, లోక్ అదాలత్ (Lok Adalat) ద్వారా కేసులను రాజీచేసుకుంటే ఇరు పక్షాలు విజయం సాధించినట్లే అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 1 వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు 90 రోజులపాటు దేశవ్యాప్తంగా మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్ నిర్వహిస్తున్నామన్నారు.

మధ్యవర్తిత్వంలో పరిష్కారమైన కేసులకు కోర్టులో

ఈ నెలలో పరిష్కరించ దగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకై మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించి, వారి మధ్యవర్తిత్వంలో పరిష్కారమైన కేసులకు కోర్టు (Court) లో రాజీ మార్గంలో తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నారు. సాధారణంగా ఏ కోర్టులో అయినా తీర్పు చెపితే, ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంటుందని, దాని పైన అప్పీళ్లకు కూడా వెళ్ళే అవకాశం వుందని ఆమె తెలిపారు. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా కానీ లేదా లోక్ అదాలత్ ద్వారా గాని పరిష్కరించుకున్నట్లైతే, కక్షిదారులు ఇరువురూ విజయం సాధిస్తారన్నారు. అదే విధంగా, జాతీయ న్యాయసేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఏడాదికి 3 నుండి 4 జాతీయ లోక్అదాలత్ లను నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

మానవ సంబంధాలు మెరుగు పడతాయని

ఇందులో భాగంగా ఈ నెల 5 వ తేదీన 2వ జాతీయ లోక్ అథాలత్ ను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లోనూ, హైకోర్టులోనూ మరియు విశాఖపట్నంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ లోనూ ఈ అథాలత్ లను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అథాలత్ తో వివాహ, ఆస్తి, సివిల్ తగాదాలు, మనీ సూట్లు, వాహన ప్రమాదాల ఇన్సూరెన్స్ కేసులు (Insurance cases). చెక్ బౌన్స్ కేసులు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను కూడా రాజీ చేసుకోవచ్చని ఆమె వివరించారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, 13 డిఎల్ఎస్ఏ లు, 147 ఎంఎల్ఎస్ఏ లు గత కొద్ది కాలంగా కృషి చేసి లోక్ అదాలత్ లో రాజీపడ దగ్గ కేసులు మొత్తం 1,15,071 రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. లోక్ ఆదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడంవల్ల కక్షిదారుల సమయం డబ్బు కూడా ఆదా అవుతుందని, మానవ సంబంధాలు మెరుగు పడతాయని ఆమె వివరించారు.

Read Hindi Also: hindi.vaartha.com

Read Also: TTD: టిటిడి నకిలీ నెయ్యి కేసు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870