📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఏపీలోనూ వ్యాపిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్

Author Icon By Vanipushpa
Updated: February 15, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) నెమ్మదిగా దక్షిణాదికి వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జీజీహెచ్‌లో వెలుగులోకి వచ్చాయి. జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు బాధితులకు గుంటూరులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు గుంటూరు జిజిహెచ్‌ను శుక్రవారం ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణబాబు సందర్శించారు.ఏపీలోనూ వ్యాపిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.
పరిస్థితిని సమీక్షించిన మంత్రి
గుంటూరు జీజీహెచ్‌లో గులియ‌న్ బాలీ సిండ్రోం (జీబీఎస్) కేసులతో పాటు రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని మంత్రికి కృష్ణబాబు వివరించారు. రాష్ట్రంలోని పలు జీజీహెచ్‌లలో ఇప్పటి వరకు 17 మంది జీబీఎస్ బాధితులు చికిత్స పొందుతున్నారని కృష్ణబాబు తెలిపారు. అన్ని జీజీహెచ్‌లలో ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అదనంగా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు అవ‌స‌ర‌మైతే వెంటనే కొనుగోలు చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు. జీబీఎస్ బాధితులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు.

ఏపీలోనూ వ్యాపిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్


పూర్తిస్థాయి అందుబాటులో చికిత్స
జీజీహెచ్‌ల‌లో పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో ఐదుగురు జీబీఎస్ పేషెంట్లు చికిత్స పొందుతుండగా, రెండు రోజుల క్రితం ఇద్దరు డిచ్చార్జ్ అయ్యారని మంత్రికి కృష్ణబాబు వివరించారు. కోనసీమ, గుంటూరు జిల్లాలు, గిద్దలూరు, నరసారావుపేట ప్రాంతాల నుండి గుంటూరు జీజీహెచ్‌లో జీబీఎస్ బాధితులు చేరి చికిత్స పొందుతున్నారు. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు తీసుకోకుండానే 80 శాతం మంది జీబీఎస్ బాధితులు రిక‌వ‌ర్ అయ్యారని కృష్ణబాబు పేర్కొన్నారు. 10 నుంచి 15 శాతం జీబీఎస్ బాధితులకు మాత్రమే చికిత్స అవ‌స‌ర‌మ‌యిందని, ఐసీయూల్లో చికిత్స అందిస్తూ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇచ్చారని తెలిపారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Guillain-Barre syndrome Latest News in Telugu Paper Telugu News prevalent in AP Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.