📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీప్రభుత్వం టాలీవుడ్‌కు తీపికబురు చెప్పింది. ఈ మేరకు సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. టికెట్ల ధరల గురించి హైకోర్టులో కేసులు నడుస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్(Vishwajit) ఉత్తర్వులు జారీ చేశారు.హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి నేతృత్వంలో 5 మంది స‌భ్యుల‌తో క‌మిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సినీ నిర్మాత వివేక్ కూచిభొట్ల కూడా ఈ కమిటీలో సభ్యుడు.సినిమా టికెట్ల ధరల సమస్యను పరిష్కరించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం థియేటర్లలో టికెట్ల ధరలు(Ticket prices) ఎలా ఉన్నాయి, న్యాయపరమైన సమస్యలు ఏమిటి అనే విషయాలను కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేస్తుంది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్(KL Damodar Prasad) కూడా టికెట్ల ధరల గురించి ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అనే దానిపై కూడా కమిటీ పరిశీలన చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో టికెట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాతలు, పంపిణీదారులు కూడా నష్టపోకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. త్వరలోనే కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

నిర్ణయం

గతంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల కోసం టికెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టు(AP High Court)లో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.బెనిఫిట్ షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నిర్ణయం టాలీవుడ్‌కు ఊరట కలిగించే అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటి ఎలాంటి నివేదిక ఇస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్కడంటే?

#AndhraPradesh #apgovt #MovieTicketPrices #Tollywood Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.