📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Gottipati Ravikumar: విద్యుత్ చార్జీలపై జగన్ అసత్యాలు :మంత్రి గొట్టిపాటి

Author Icon By Sharanya
Updated: May 9, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ తీవ్రంగా ఖండించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అసత్యాలతో నిండి ఉన్నాయని, ప్రజలలో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

జగన్ హయాంలో విద్యుత్ రంగ విధ్వంసం

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖపై రూ.1.29 లక్షల కోట్ల రుణ భారం మోపబడిందని, షార్ట్ టైం పవర్ పర్చేస్ పేరిట ఒక్క ఏడాదిలోనే రూ.10,000 కోట్ల మేర ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు. ఇంకా, వైసీపీ ప్రభుత్వం కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని గుర్తు చేశారు.

gottipati ravi kumar

తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించకండి

యాక్సిస్, బ్రూక్ ఫీల్డ్ కంపెనీతో కూట‌మి ప్ర‌భుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల‌పై అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం లో సెకీ నుంచి రూ.2.49కి విద్యుత్ కొనుగోలు చేసామనేది పచ్చి అబద్ధమని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. విద్యుత్ సరఫరా నష్టాలు , ఇతర ఖర్చులన్నీ కలిపితే యూనిట్ కు రూ.5 పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు.

రైతులకు లాభాలు – యువతకు ఉపాధి

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కూట‌మి ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌పై జ‌గ‌న్ అన‌వస‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని మంత్రి గొట్టిపాటి మండిప‌డ్డారు. అత్య‌ధిక విద్యుత్ వినియోగం జ‌రిగే స‌మ‌యంలో ఒత్తిడిని త‌ట్టుకునేందుకు, ప్ర‌జ‌ల‌కు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఒప్పందాలు ఎంతో ఉప‌యోగప‌డ‌తాయ‌ని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందాల‌తో రాయ‌ల‌సీమ ప్రాంతంలో 400 మోగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తితో పాటు రాష్ట్ర యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా పీక్ అవర్స్ లో కూడా యూనిట్ రూ.4.60కే విద్యుత్ దొరుకుతుందని విద్యుత్ మంత్రి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో 2022 లో రూ.5.12కు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే..తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ను రూ.4.60కి తగ్గించి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 1,700 ఎక‌రాలను రైతుల‌ నుంచి తీసుకుని వారికి ఏడాదికి రూ.31 వేలు కౌలు అందిస్తున్నామని వెల్లడించారు. అంతేగాక రాష్ట్రానికి యాక్సిస్ ఎనర్జీ నుంచి 9 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం ల‌భిస్తుంద‌న్నారు.

చంద్రబాబు దృష్టి – పెట్టుబడులపై నమ్మకం

యాక్సిస్ ఎనర్జీ తన పెట్టుబడులను ఏపీలో పెట్టిందని, వీటి ద్వారా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుండటంతో విద్యుత్ సరఫరా నష్టాలు లాంటివి ఉండవని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఇటువంటి ఒప్పందాల ద్వారా విద్యుత్ ఛార్జీలు త‌గ్గించి ప్ర‌జ‌ల‌పై భారం లేకుండా చేయాల‌న్న‌ది సీఎం చంద్రబాబు ఆలోచ‌న అన్నారు. . పెట్టుబడిదారుల్ని తరిమికొట్టిన చరిత్ర జగన్ ది అయితే, పెట్టుబడులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుది అన్నారు.

Read also: TTD: టీటీడీ భక్తులు అసంతృప్తితో వెళ్లిపోతున్నారు:వెంకయ్య చౌదరి

#AndhraPradesh #APPolitics #ElectricityCharges #GottipatiRavikumar #jagan #JaganFalseClaims #TDPLeader #YSRCPFailures Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.