📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Gottipati Ravi Kumar: ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు పై మంత్రి కీలక ప్రకటన

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 8:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతికి కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) ఆధ్వర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని మంత్రి ర‌వికుమార్ ప్రారంభించారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నం (ECBC Building) దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా నిలుస్తుంద‌ని ఆకాంక్షించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భ‌వ‌నం ద్వారా సుమారు 40 శాతంపైగా విద్యుత్ ఆదా అవుతుండ‌టం ఆద‌ర్శప్రాయమ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌న్నారు.

నియామక పత్రాలు

విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 నెలల్లో సుమారు 180 మందికి నియామక పత్రాలు అందజేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ఆధ్వర్యంలోని కూట‌మి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక ఉదాహ‌ర‌ణ. విద్యుత్ శాఖ‌లో విధినిర్వహణలో లైన్‌మెన్ లు వంటి కింద‌ స్థాయి సిబ్బంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండ‌టం బాధాక‌రం. మంత్రి ప్రమాదాల్లో మ‌ర‌ణించిన వారికి కూట‌మి ప్రభుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంది’ అన్నారు గొట్టిపాటి (Gottipati Ravi Kumar). స్వాతంత్య్రం వ‌చ్చిన 75 సంవ‌త్సరాలు దాటిన తరువాత కూడా ఇంత వ‌ర‌కు విద్యుత్ సౌక‌ర్యం లేని, తండాలు, చెంచు గూడేల‌కు రూ.120 కోట్లు వ్యయంతో విద్యుత్ అందించాము. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు వేయ‌లేని టైగ‌ర్ రిజ‌ర్వ్ ప్రాంతాల్లోని నివాసితుల‌కు కూడా సోల‌ర్ ప్యానెల్స్, బ్యాట‌రీ స్టోరేజ్ ప‌ద్ధతుల‌లో నిరంత‌ర విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. ఇది కూట‌మి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజ‌లంద‌రికీ గ‌ర్వకార‌ణం’ అన్నారు.

Gottipati Ravi Kumar

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ

విద్యుత్ శాఖ‌కు సంబంధించి ప్రజ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అనేక‌ చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని. 24 గంట‌లూ నాణ్యమైన గ్రీన్ ఎన‌ర్జీ (Green energy) ని ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల‌కు అందించే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్నాము. కేంద్ర ప్రభుత్వ స‌హ‌కారంతో 20 ల‌క్షల సోలార్ విద్యుత్ క‌నెక్షన్లను ఇవ్వడానికి ప్రయ‌త్నిస్తున్నాము. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం 10 వేల సోలార్ విద్యుత్ క‌నెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాము. సోలార్ క‌నెక్షన్లను వేగ‌వంతం చేసే క్రమంలో ఎదుర‌య్యే ఇబ్బందులను అధిగ‌మించేందుకు స్థానిక సోలార్ (Local solar) త‌యారీదారుల‌ను ప్రోత్సహిస్తున్నాము. అదే విధంగా పీఎం కుసుమ్ ప‌థ‌కంలో భాగంగా, వ‌చ్చే వ్యవ‌సాయ సీజ‌న్ నాటికి రైతుల‌కు ప‌గ‌టి పూటే 9 గంట‌ల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తాము. రాష్ట్రంలోని మూడు ల‌క్షల వ్యవ‌సాయ పంపు సెట్లకు సోలార్ క‌నెక్షన్లను అనుసంధానించే ప్రక్రియ వేగ‌వంతం చేశాము’ అన్నారు మంత్రి.

Read Also: TDP నేతలను నిలదీయండి అంటూ సజ్జల పిలుపు

#APEPDCL #ChandrababuNaidu #MinisterRaviKumar #SuperECBCBuilding #Visakhapatnam Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.