📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త

Author Icon By Anusha
Updated: May 14, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలోని డ్వాక్రా మహిళలకు  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల చెప్పినట్లుగానే జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (ఎంఎల్‌సీసీ) యాప్ ద్వారా రుణాలు ఇస్తాయి.ఇకపై నేరుగా రుణాలు ఇవ్వడం కుదరదు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి మెప్మా కొత్తగా యాప్ తీసుకొచ్చింది. తాడేపల్లిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, సంచాలకులు సంపత్‌కుమార్, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్‌భరత్‌ పాల్గొన్నారు.రాష్ట్రంలోని 2.74 లక్షల స్వయం సహాయక సంఘాల(SelfHelpGroups) సమాచారం యాప్‌లో అందుబాటులో ఉంటుంది.ఈ యాప్‌ను బ్యాంకులకు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 బ్యాంకులకు చెందిన 2,066 బ్రాంచిలకు లాగిన్‌లు ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. పట్టణాల్లో పది వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సురేశ్‌కుమార్ కోరారు. బ్యాంకులు రుణాలు ఇచ్చి మహిళలు వ్యాపారాలు చేయడానికి సహాయం అందిస్తాయి. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలు సొంతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త

ప్రభుత్వం

ఈ యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారు. రుణ వాయిదాల చెల్లింపుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. దీనివల్ల లక్షల రూపాయల నగదు పక్కదారి పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ కసరత్తు చేసింది. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింక్, స్త్రీనిధి వంటి రుణాలను సక్రమంగా అందించవచ్చు. స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు.కొత్త యాప్(New app) అందుబాటులోకి వస్తే నేరుగా చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. చెల్లింపుల్లో మోసాలకు అవకాశం ఉండదు. నెలవారీ వాయిదాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లించవచ్చు. చెల్లింపు చేసిన వెంటనే మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. దీనివల్ల వాయిదా సొమ్ము ఎవరూ స్వాహా చేయలేరు. లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం యాప్‌లో ఉంటుంది. యాప్ వినియోగంలోకి వస్తే పారదర్శకత పెరుగుతుందంటున్నారు అధికారులు. ఈ యాప్ ద్వారా డ్యాక్రా సంఘాల్లో మహిళలు సులభంగా, సురక్షితంగా తమ రుణ వాయిదాలను చెల్లించవచ్చు అంటున్నారు. మొత్తానికి డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ యాప్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Andhra Pradesh: భారత ఆర్మీకి మంత్రాలయం మఠం విరాళం

#DWACRA #selfhelpgroups #telugu News AndhraPradesh Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news WomenEmpowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.