జూరాల, సుంకేశుల జలాశయాలకు వరద ప్రవాహం నిలకడగా సాగుతున్న గోదావరి
హైదరబాద్ : తెలుగు రాష్ట్రాలకు ప్రాణధారమైన కృష్ణానదిలో జలప్రవాహం పెరిగితే గోదావరి నది మందగమనంతో ప్రవహిస్తున్నది.కృష్ణాగోదావరి నదులపై ఉన్న జలాశయాల్లో 289.52టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. గత ఏడాది కంటే 81.46టిఎంసిల అధికమైన నీరు జలశాయాల్లో ఉంది.గత ఏడాది జూన్ 15న 207.06టిఎంసిల నీరు మాత్రమే జలాశయాల్లో ఉంది. తెలంగాణతో పాటు ఎగువన ఇతర రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ, ముసురు వర్గాలకు జూరాల జలశయానికి వరద వస్తోంది. కృష్ణానదిలో రోజురోజు రోజురోజుకూ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయం నుంచి వస్తున్న వరదజలాల ప్రవాహంతో మండలంలోని మంచాలకట్ట. జటప్రోల్, మల్లేశ్వరం, కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి తదితర గ్రామాల్లో కృష్ణానది నీటి మట్టం పెరిగింది.
జలశయాల్లో
కృష్ణానదికి వరద పెరగడంతో నదిలో చేపలు పట్టడానికి మత్స్యకారులు ఎవరూ వెళ్ల రాదని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉండే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులను అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరి కృష్ణనదులపై ఉన్న జలశయాల్లో గత ఏడాదితో పోల్చితే నీరు సంతృప్తికరంగానే ఉంది.వ్యవసాయ పనులు ప్రారంభించడానికి వీలుగా నీరు ఉంది. లాల్బహుద్దూర్ శాస్త్రి ఆలమట్టి ప్రాజెక్టు (Lal Bahadur Shastri Alamatti Project) లో గత ఏడాది 26.96 టిఎంసిల నీరు ఉంటే ఈ యేడాది65, 95 టిఎంసిల నీరు ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టు జలాశయంలో ఉంది. నారాయణపూల్లో 31.47 టిఎంసీలు ప్రస్తుతం నీరు ఉండగా గత ఏడాది ఇదే రోజు 24.92 టిఎంసిలు ఉంది. ఉజ్జయినిలో 87.4టిఎంసీలు ప్రస్తుతం ఉండగా గత ఏడాది 36.98 టిఎంసిలు ఉంది. జూరాలలో గత ఏడాది కంటే 1.73 టిఎంసిలు తక్కువ నీరు ఉంది. గత ఏడాది 7.89టిఎంసిలు ఉంటే ఈ ఏడాది 6.16 టిఎంసిలు మాత్రమే ఉంది.అయితె పై నుంచి నీటి వరద వస్తున్నది. తుంగభద్రలో 26.87టి ఎంసిలు ఉంటే గత ఏడాది 6.02టిఎంసిలు నీరు ఉంది.
టిఎంసిల నీరు
శ్రీశైలంలో గత ఏడాదితో పోల్చితే 25టిఎంసిలు నీరు అధికంగా జలాశయంలో ఉంది. పోయిన ఏడాది 34.79 టిఎంసిలు ఉంటే ఈయేడాది 60.46టిఎంసిలు అందులో ఉంది. నాగార్జునసాగర్లో కూడా అధికంగా నీరు ఉంది గత ఏడాది 122.69 టిఎంసిల నీరు ఎన్ఎస్పిలో ఉండగా ప్రస్తుతం అందులో 137.17టిఎంసిల నీరు అందులో ఉంది.పులిచింతలలో 24.63 టిఎంసిలు ఉంది గతజూన్ 15న ఇక్కడ 0.75టిఎంసిల నీరుమాత్రమే నిల్వ ఉండేది.కృష్ణా డెల్టాలో కూడా పోయిన ఏడాదితో పోల్చితే ఒక టీఎంసి అందులో అధికంగా ఉంది 3.07 టిఎంసిలు ప్రస్తుత నీటినిల్వ అని అధికారులు తెలిపారు.
గత ఏడాది
గోదావరిలో కూడా నీరు గత ఏడాదితో పోల్చితే ఎక్కువగానే ఉంది. గైక్వార్డ్ ప్రాజెక్టులో 48.9 టిఎంసిలునీరు ఉంది. గత ఏడాది ఇదే రోజు ఇక్కడ 30.4 టిఎంసిల నీరు ఉంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్లో గత ఏడాది కంటే 6టిఎంసీలు అధికంగా నీరు ఉంది. శ్రీరామసాగర్లో 13.83టిఎంసిలు ఉంది. సింగూరులో 19.31 టిఎంసిలు, నిజామ్ సాగర్లో 6.06, మిర్మానేరులో 6.92 టిఎంసిలు, లోయర్ మానేరులో 6.47, కడెంలో 065టిఎంసిలు, శ్రీపాద ఎల్లంపలిలో 8.7గోదావరి డెల్టా3.01 టీఎంసీలు నీరు ఉంది. తెలంగాణాలోని గోదావరి బేసిన్లోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో గరిష్టనిల్వ 46658 ఎంసిఎఫ్ టి కాగా ప్రస్తుతం 17989 ఎంసిఎస్టి నీరు ఉంది.
అధికంగానే
కృష్ణాబేసిన్ లోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో 7674 ఎంసిఎపిటి నీరు నిల్వఉంది. మొత్తంగా మధ్యతరహా ప్రాజెక్టుల్లో గత యేడాది కంటే నీరు అధికంగానే ఉంది. తెలంగాణలో మధ్యతరహా ప్రాజెక్టులు మొత్తం గరిష్టంగా 62126 ఎంసిఎఫ్టి నిల్వ నీరు సామర్థ్యం కలిగి ఉంటే ప్రస్తుతం అందులో 25660 టిఎంసిల నీరు నిలిచి ఉంది. గోదావరి బేసిన్లోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో 1059 క్యూసెక్కుల నీటి ఇన్ఫ్ల ఉండగా కృష్ణా బేసిన్లో 720 క్యూసెక్కుల నీరు ఇన్ప్లే ఉంది. మొత్తంగా రెండు బేసిన్లలో 1779 క్యూసెక్కుల ఇన్ప్లే మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఉంది.
Read Also: Rains : Rains : తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు