📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vishakapatnam: విశాఖ విమ్స్‌లో మోకాళ్లకు ఉచిత ట్రీట్మెంట్

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 6:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం విమ్స్‌‌లోని ఎముకల విభాగానికి ఎక్కువ మంది వస్తుండగా,మోకాళ్ల నొప్పులకు అత్యాధునిక ప్లాస్మా చికిత్స ఉచితంగా అందుబాటులో ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలల్లో ఖర్చయ్యే ఈ చికిత్సను విమ్స్‌లో ఉచితంగా అందిస్తున్నారు. దీని ద్వారా చాలా మంది నొప్పుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. విమ్స్ ఆసుపత్రి ఇప్పుడు కేజీహెచ్‌కి మరో ఆసుపత్రిలా ఉపయోగపడుతుంది.కేజీహెచ్ దూరంగా ఉన్నవాళ్లు, శివారు ప్రాంతాల వాళ్లు ఇక్కడికి వస్తున్నారు. ప్రతిరోజు 500 నుంచి 700 మంది ఓపీకి వస్తుంటారు. అందులో 180 నుంచి 225 మంది వరకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటారు. అన్ని విభాగాలకన్నా ఎముకల సమస్యలతో వచ్చేవాళ్లే ఎక్కువ.విమ్స్‌లో మోకాళ్ల నొప్పులకు సరికొత్త ప్లాస్మా ట్రీట్‌మెంట్ ఉంది. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ట్రీట్‌మెంట్(Treatment) చేయించుకుంటే చాలా డబ్బులు అవుతాయి. కానీ విమ్స్‌లో మాత్రం ఉచితంగా చేస్తున్నారు. దీని ద్వారా ఏటా వేల మంది నొప్పులు తగ్గిపోతున్నాయి. 50 ఏళ్లు దాటకుండానే చాలామంది మోకాళ్ల నొప్పు(Knee pain)లతో బాధపడుతున్నారని కొంతమందికి మోకాళ్ల చిప్పలు అరిగిపోయి నడవలేని పరిస్థితి వస్తుంది. దీనికి ప్లాస్మా థెరపీ అనే కొత్త వైద్యం అందుబాటులో ఉంది.బయట ఆసుపత్రుల్లో ఈ ట్రీట్మెంట్ ఖరీదైనది కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి విమ్స్‌లో ఉచితంగా ప్లాస్మా చికిత్స అందిస్తున్నాము అన్నారు. ఈ ట్రీట్‌మెంట్‌లో మోకాళ్లలోని రక్తాన్ని తీసి, దాని బదులు ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇలా రెండు మూడు సార్లు చేస్తే రోగులు నార్మల్‌గా నడవగలుగుతారు. ఈ విభాగంలో 5 మంది డాక్టర్లు, 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

విశాఖ విమ్స్‌లో మోకాళ్లకు ఉచిత ట్రీట్మెంట్

విభాగం

తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు పీఆర్‌పీ విధానం(PRP method)లో ట్రీట్‌మెంట్ చేస్తున్నారు అక్కడి డాక్టర్లు. దీనివల్ల రోగులు నొప్పి లేకుండా నడవగలుగుతారని,ఈ తరహా చికిత్స రాష్ట్రంలో మరే ఇతర ప్రభుత్వాసుపత్రిలో లేదని ఆ ఘనత విమ్స్‌‌(Vims)కే దక్కుతుందంటున్నారు. ఎముకల విభాగం ఓపీకి ఎక్కువ మంది వస్తుండగా ఫిజియోథెరపీతోనే చాలామందికి నొప్పులు తగ్గుతున్నాయట అవసరమైన వాళ్లకు ఆపరేషన్లు కూడా చేస్తున్నారు డాక్టర్లు. విమ్స్‌లో ఏడాదిలో మోకాళ్ల చిప్పల మార్పిడి – 38, తుంటి ఎముక – 22, ప్లేట్లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపి(పీఆర్‌పీ) (మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి) – 1800, ఫిజియో థెరపి – 18,000 పూర్తిచేశామంటున్నారు. విశాఖవాసులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు విమ్స్ డాక్టర్లు.

Read Also : Murali Nayak: ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి జ‌గ‌న్‌ ఆర్ధిక సాయం

#FreeHealthcare #GoodNews #VIMS #Visakhapatnam Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.