📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anantapuram: అనంతపురం మాజీ ఎంపీ ఇకలేరు

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ మాజీ సభ్యులు, సీనియర్ రాజకీయవేత్త దరూరు పుల్లయ్య (Darur Pullaiah)(93) నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచివేసింది. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.కర్ణాటకలోని బళ్లారిలో దరూరు పుల్లయ్య నివాసం ఉంటున్నారు. నిన్న ఉదయం బళ్లారి నుంచి కంప్లి సమీపంలోని కొట్టాల వద్ద గల తమ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించేందుకు కారులో వెళ్లారు. పొలం పనులు చూసుకుని తిరిగి ఇంటికి పయనమయ్యారు. మార్గమధ్యంలో కంప్లి వద్ద రోడ్డు పక్కన ఉన్న ఒక మిత్రుడితో మాట్లాడేందుకు వాహనం దిగారు. అదే సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెంటనే ఆయన భౌతికకాయాన్ని బళ్లారిలోని ఆయన నివాసానికి తరలించారు.

అనంతపురం మాజీ ఎంపీ ఇకలేరు

కన్వీనర్‌

దరూరు పుల్లయ్య స్వగ్రామం అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం చాయాపురం. మద్రాసులో న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆయన, ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968 నుంచి 1978 వరకు పదేళ్లపాటు ఉరవకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1977, 1980 సార్వత్రిక ఎన్నికలలో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటంతో పాటు, అనేక సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు.ఆయనకు భార్య సత్యవతి, ఆరుగులు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మద్రాస్ లో లా పూర్తి చేశారు. పుల్లయ్య మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నెల 14వ తేదీ, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘం నేతలు సంతాపం తెలిపారు.ఉరవకొండ నియోజకవర్గం(Uravakonda Constituency) నుంచి 1962లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.1968 నుంచి 1974 వరకు ఉరవకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రెండు సార్లు గెలుపొందారు. 1977-79, 1982-85 మధ్య అనంతపురం ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు.కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1965 నుంచి 1977 వరకు కంప్లి షుగర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా, బీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా విధులు చేపట్టారు.

Read Also: TTD: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

#DaruruPullayya Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.