Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం లో నకిలీ ఈ స్టాంపులు వ్యవహారం బయటపడిందని, ఇలాంటి నకిలీ స్టాంపుల (Fake E- Stamp) రాకెట్ పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళ్యాణ్ దుర్గం (Kalyan Durga) శాసనసభ్యుడు అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendrababu) తనయుడు, ఎస్సార్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమిలినేని యశ్వంత్ (Amilineni Yashwanth) విజప్తి చేశారు. నూరు రూపాయల ఈస్ట్రాంపులను (E- Stamp) లక్ష రూపాయల విలువ గల ఈ స్టాంపులుగా మార్పింగ్ చేసి ఈ స్టాంపులను అమ్మకాలు చేసిన ముఠా చర్యలు కళ్యాణ్ దుర్గం (Kalyan Durga) లో బయటపడ్డాయని, ఇదేవిధంగా రాష్ట్రంలో జరిగి ఉండే అవకాశం ఉందన్నారు. ఈ స్టాంపు వ్యవహారంలో రాకెట్ చర్యలను ఎదుర్కొనే విధంగా సిస్టంలో లోపాలుంటే సరిచేయాలని ఆయన రాష్ట్ర ఉన్నతాధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అనంతపూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సార్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ (Essar Infra Developers Limited) ఏజీఎం సతీష్, సంస్థ ఆడిటర్ బాలాజీ తో కలిసి అమిలినేని యశ్వంత్ మాట్లాడారు. ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ నిర్మాణ రంగంలో 27 ఏళ్ల నుంచి పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుందని, ఎక్కడ మచ్చ లేదని ఆయన వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమ సంస్థపై అనవసరంగా ఆరోపణ చేసినా, సంస్థకు చెడ్డపేరు వచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా న్యాయపరంగా చర్యలు తీసుకుంటావని ఆయన వెల్లడించారు.

ఈ స్టాంపుల వ్యవహారంలో మా సంస్థ ఎక్కడ తప్పులు చేయలేదని, బ్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించిన తర్వాతే ఈ స్టాంపులు కొనుగోలు చేశామని, డబ్బులు చెల్లించకపోతే తమది తప్పు అవుతుందని ఆయన వెల్లడించారు. తమ సంస్థ తరఫున బ్యాంకు రుణాలు తదితర వాటికోసం కళ్యాణ్ దుర్గం (Kalyan Durga)లో ఎర్రప్ప సతీమణి ఏజెంట్ గ ఉన్న సంస్థ వద్ద ఈ స్టాంపులను 2023 జనవరి నుంచి కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ సంస్థ తమకు ఈ స్టాంపులు (E- Stamp)స్థానంలో నకిలీ ఈ స్టాంపులు అమ్మినట్లు ఇటీవల సంస్థ ఆడిట్ రిపోర్ట్ లో తేలిందని, వెంటనే అందుకు బాధ లేని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. నకిలీ ఈ స్టాంపులు (Fake E- Stamp)వ్యవహారంలో మేమే పోలీసులకు ఫిర్యాదు చేసి రాకెట్ బయటికి లాగితే ఈ విషయంలో మాదే తప్పు ఉందని అవాస్తవాలతో ఆరోపణ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్న మా సంస్థ చిన్న మొత్తాలలో ఉన్న ఈ స్టాంపులను నకిలీ ఎందుకు తీసుకుంటున్నది? బ్యాంకులు, అధికారులు, ఇతర కాంట్రాక్టర్ల వద్ద మేము ఎలా తల ఎత్తుకొని నిలబడతామని ఆయన ప్రశ్నించారు. అందుకే నకిలీ ఈ స్టాంప్స్ వ్యవహారంలో రాష్ట్రాప్తంగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయాలని తాము కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. 463 లో 19 నకిలీ ఈ స్టాంపులు అని గుర్తించాం ఆడిటర్ బాలాజీ వెల్లడి ఎస్సార్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ తరపున అనంతపురం, కళ్యాణ్ దుర్గం, సింగనమల, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే విషయంలో గత మూడేళ్ల కాలంలో కళ్యాణ్ దుర్గం లోని ఎర్రప్ప, ఆయన సతీమణి నిర్వహిస్తున్న ఏజెన్సీ నుంచి 463 ఈ స్టాంప్స్ తీసుకున్నామని అందులో 19 ఈ స్టాంప్స్ లు నకిలీవని తమ ఆడిట్లో తేలినట్లు ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఆడిటర్ బాలాజీ వెల్లడించారు.
Read also: AP Jobs: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం