हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Excellence Awards: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవార్డుల ప్రకటన

Ramya
Excellence Awards: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవార్డుల ప్రకటన

Vijayawada: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎక్సలెన్స్ అవార్డ్స్ (Excellence Awards) ప్రకటన ఉత్సాహనిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పరిచయ కార్యక్రమంను విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ కి ప్రోత్సాహకాలు పై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ కాబడిన కంపెనీలను గుర్తించి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుందని మొత్తంగా 14 రంగాల్లో నామినేటెడ్ చేయటం జరుగుతుందన్నారు. అవార్డు గ్రహీతల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రం లో మెరుగైన వనరులు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవడం పై ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టి లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నారు. పీ4 మోడల్ ద్వారా సామాన్యుడిని సైతం పైకి తేవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Excellence Awards: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవార్డుల ప్రకటన

సీఎం విజన్‌నే రాష్ట్ర అభివృద్ధికి బలంగా పేర్కొన్న మంత్రి

Excellence Awards: మన ముఖ్యమంత్రి విజన్ మన రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా హైదరాబాద్ ను గమనించవచ్చని మంత్రి అన్నారు. గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు (Entrepreneurs) 12 రంగాల్లో 15 అవార్డులను అందించనున్నారని వివరించారు. ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య వారధిలా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ పనిచేస్తుందన్నారు. మన రాష్ట్రంలో 13 పోర్ట్స్్ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముందుకు వెళుతున్నారన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కాదు ఫోర్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఉందని, టర్బో ఇంజన్ రూపం లో చంద్రబాబు, లోకేష్, పవన్, బీజేపీ లు లాంటి ఫోర్ ఇంజన్ లు కలిగి ఉన్నాయని ఇక అభివృద్ధిలో వెనకడుగు వేసే ఉద్యోగస్తులకు కూడా అవార్డ్స్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు, పారిశ్రామిక వేత్తలకు మధ్య సత్సంబందాలు పెరుగుతాయని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అభిప్రాయ పడ్డారు. సభలో తొలుత మంత్రి పార్థసారథి ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆడియో విజువల్ (ఏవీ)ని విడుదల చేయగా, మంత్రి కొల్లు రవీంద్ర ఆవార్డుల బ్రోచర్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అవార్డుల లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ / పనిచేస్తున్న సంస్థలు తమ నామినేషన్లను ధాఖలు చేయడానికి అర్హులని అన్నారు. నామినేషన్లను జూలై 30 లోపు ధాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ల ధాఖలు కోసం వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. విజేతలను ఈ ఏడాది ఆగస్టు 30న నిర్వహించే కార్యక్రమంలో అవార్డులతో సత్కరించనున్నామని తెలిపారు. ఇతర వివరాలకు 9121221473, 9121221474, 9912092222 నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

read hindi news: hindi.vaartha.com

Read Also: Agile : వ్యవసాయ శాఖలో అందుబాటులోకి వచ్చిన అజైల్ యాప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870