📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే

Author Icon By Anusha
Updated: March 14, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.2019లో జరిగిన ఈ హత్య ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది.సు విచారణలో ఇప్పటికే పలువురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడం మరింత కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు కేసుపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

కేసు నేపథ్యం

2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి తన కడప జిల్లా పులివెందులలోని నివాసంలో హత్యకు గురయ్యారు. మొదటిసారి ఇది సహజ మరణంగా ప్రకటించినా,పోస్ట్ మార్ట్ మ్ లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు ముమ్మరమైన కొద్దీ హత్యకేసుకు సంబంధించి అనేక అనుమానాలు, కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

సాక్షుల మృతి కలకలం

ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా, కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన ప్రాణహానిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన భద్రతను పెంచారు. ఇప్పటికే పలువురు ఈ కేసులో కీలకమైన వ్యక్తులు వివిధ కారణాలతో మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

దర్యాప్తు

సీబీఐ కేసును విచారిస్తున్నప్పటికీ మిస్టరీ ఇంకా వీడటం లేదు.కీలక సాక్షులపై ఒత్తిళ్లు ఉన్నాయని, వారిపై భద్రతా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

దస్తగిరికి భద్రత పెంపు

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం 1+1 భద్రత కలిగిన దస్తగిరికి, పోలీసులు 2+2 భద్రత అందించారు. 1+1 భద్రత అంటే: ఒక కానిస్టేబుల్, ఒక వ్యక్తిగత గన్‌మెన్.2+2 భద్రత అంటే: ఇద్దరు గన్‌మెన్లు, ఇద్దరు పోలీసు రక్షణ అధికారులు.ఈ భద్రత దస్తగిరికి ఉన్న ప్రాణహాని నేపథ్యంలో తీసుకున్నదని పోలీసులు తెలిపారు.

దస్తగిరి విజ్ఞప్తి

సాక్షుల మృతితో ఆందోళన చెందిన దస్తగిరి, కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని, అదనపు భద్రత అవసరమని ఎస్పీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు.తాను కడప జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. 

కేసుపై కొత్త అనుమానాలు

వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు నూతన అనుమానాలకు తావిస్తున్నాయి. వరుసగా ప్రధాన వ్యక్తులు మృతి చెందడం,అనేక అనుమానాలకు దారితీస్తోంది.

#AndhraPradesh #BreakingNews #CrimeInvestigation #Dastagiri #JusticeForViveka #Kadapa #LawAndOrder #SecurityIncreased #WitnessSafety #YSVivekanandaReddyMurderCase Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.