Educational exploitation : విద్య దోపిడీని అరికట్టే చర్యలు ఏవీ?

Follow Us: Google News Daily Hunt
Educational exploitation
Educational exploitation
FONT SIZE
GET APP

Educational exploitation : నేటి ఆధునిక సమాజంలో విద్య అనేది ఒక ఉత్కృష్ట మైన ఆశయం నుండి అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా రూపాంతరం చెందడం అత్యంత విచారకరం. ఒకప్పుడు జ్ఞానాన్ని పంచే నిర్మలమైన దేవాలయాలుగా వెలుగొందిన పాఠశాలలు, నేడు కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేవలం లాభాలను ఆర్జించే అడ్మిషన్ల ఫ్యాక్టరీలుగా మారి పోయాయి. ముఖ్యంగా ఎల్కేజీ వంటి (పాథమిక తరగ తుల ప్రవేశానికే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుండటం సామాన్య, మధ్యతరగతి తండ్రి గుండెను కలచివేస్తోంది. చదువుకోవడానికి లక్షలు ఉంటేనే అర్హత అన్నట్లుగా తయారైన ప్రస్తుత పరిస్థితుల్లో, నిరుపేదలు తమ బిడ్డలను నాణ్యమైన చదువుకు దూరం చేసుకోవాలా అనే ప్రశ్న నాగరిక సమాజాన్ని నిలదీస్తోంది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పుడు కేవలం విద్యను మాత్రమే కాకుండా ఒక రకమైన స్టేటస్ సింబల్ను విక్రయిస్తున్నా యి. ఏసీ క్లాస్ రూమ్లు, అత్యాధునిక క్రీడా మైదానాలు స్మార్ట్ బోర్డుల పేరుతో సామాన్యుడు కలలో కూడా ఊహించని ఫీజులను విధిస్తూ అక్షరాల అంగడిని నడుపు తున్నాయి.

Read Also : Kakatiya University Rat Attack: కేయూలో ఎలుకల దాడి.. 14 మందికి గాయాలు

Educational exploitation
Educational exploitation

Educational exploitation : విద్యావ్యయం 150శాతం

తాజా గణాంకాల ప్రకారం గత దశాబ్దకాలంలో విద్యావ్యయం దాదాపు 150శాతం పెరిగింది, కానీ సామాన్యుడి ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగలేదు. ప్రైవేట్ స్కూళ్ల (Private schools)లో అడ్మిషన్ సమయంలోనే డొనేషన్ల రూపంలో లక్షలు వసూలు చేయడం చట్టరీత్యా నేరమైనా, అవి డెవలప్మెంట్ ఫీజు లేదా కరికులర్ ఫీజు అనే పేర్ల తో బహిరంగంగానే సాగుతున్నాయి. పుస్తకాలు, యూనిఫాం లు, బెల్టులు, చివరకు షూపాలిష్ కూడా స్కూల్లోనే కొనాలనే నిబంధనలు తల్లి దండ్రుల నడ్డి విరుస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లు నిరుపేదలకు కేటా యించాలనే నియమం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి లో అది అమలు కావడం లేదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్ప స్కూళ్లలో చదివించాలని ఆశపడినా, ప్రవేశ ద్వారం దగ్గరే ఫీజుల రూపంలో ఎదురవుతున్న అడ్డుగోడలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ‘మా పిల్లలకు తెలివితేటలు ఉన్నా, మాదగ్గర డబ్బు లేనందున వారు వెనుకబడిపోవా లా?’ అని వారు వాపోతున్న తీరు హృదయవిదారకం.

Educational exploitation
Educational exploitation

జ్ఞానానికి విలువ ఇచ్చే మార్గాలు

ప్రభుత్వాలు కేవలం జీవోలు జారీచేసి చేతులు దులుపుకో వడం వల్ల ప్రయోజనం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఒక శక్తివంతమైన ఫీజు నియంత్రణ కమిటీ ఉండాలి. స్కూల్ మౌలిక సదుపాయాలను బట్టి ఫీజులకు ఒక పరిమితిని నిర్ణయించి, ఆ పరిమితిని మించి ఒక్కరూపాయి వసూలు చేసినా గుర్తింపు రద్దు చేసేలా కఠినచట్టాలు తీసుకురావా లి. అలాగే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికిమించి తీర్చిదిద్దినప్పుడే ప్రైవేట్ పాఠశాలల(Private schools) అరాచకాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రైవేట్ స్కూళ్ల ఆదాయ వ్యయాలను ప్రతి ఏటా ఆడిటింగ్ చేయించి పారదర్శకతను పెంచాలి. విద్య అనేది లాభాపేక్ష లేని సేవారంగం అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినా, ఆతీర్పుల అమలులో అధికార యంత్రాంగం వైఫల్యం కనిపిస్తోంది. విద్యా వ్యాపా రాన్ని అరికట్టడంలో తల్లిదండ్రుల్లోనూ చైతన్యం రావాలి. కేవలం ఆడంబరాల కోసం లక్షల ఫీజులు కట్టడం కంటే జ్ఞానానికి విలువ ఇచ్చే మార్గాలను వెతకాలి. పేదవాడిబిడ్డ కూడాడాక్టర్, ఇంజనీర్ లేదా కలెక్టర్ కావాలనే కలకనేఅధికారం ఈ దేశంలో ఉంది. ఆ కలకు లక్షలరూపాయల ఫీజులు అడ్డు గోడలుగా మారకూడదు. ప్రభుత్వం ఇప్పటి కైనా మేల్కొని విద్యా దోపిడీపై ఉక్కుపాదంమోపి, అందరికీ సమాన, నాణ్య మైన విద్యను అందించే దిశగా చర్యలు చేపట్టాలి.


-డా. చిట్యాల రవీందర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు