📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Double Decker Bus: విశాఖను పలకరించనున్న హో హో బస్సులు

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం పర్యాటక రంగానికి మరొక కొత్త రూపాన్ని అందించేందుకు హోహో డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధమవుతున్నాయి.ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విశాఖలో హో హో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ బస్సులు ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్‌(Vizag Beach Road)లో సేవలు అందించనున్నాయి.సుందరమైన సాగర తీరం ఆహ్లాదకరమైన వాతావరణం ఎత్తయిన పచ్చటి కొండలు మనసు దోచుకునే పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు వైజాగ్ ఒకపక్క సాగర తీరం అందాలు మరోపక్క పచ్చదనం పరిచినట్లు కనిపించే పర్వత శ్రేణులు. కైలాసగిరి సొగసులు అలనాటి బౌద్ధరామాలు ఒకటేంటి, ఇటువంటి ప్రదేశాలు విశాఖ వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని వినూత్నంగా చూసే అవకాశం, హో హో డబుల్ డెక్కర్‌ బస్సు(Ho Ho double decker bus)లతో కలగనుంది. తొలిసారిగా డబుల్‌ డెక్కర్ బస్సుల నుంచి విశాఖ ప్రకృతి అందాలు చూసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ఓ బస్సు విశాఖకు చేరుకుంది.

ప్రధాన నగరాల్లో

ఈ డబుల్ డెక్కర్ బస్సులను విదేశాల్లో హో హో అని పిలుస్తారు. అంటే “హాప్‌ ఆన్‌ హాప్‌”. లండన్, ప్యారిస్, న్యూయార్క్, ఏథెన్స్ రోమ్, టోక్యో, బార్సిలోనా, పట్టాయా లాంటి ప్రముఖ నగరాల్లో టూరిస్టుల కోసం ఈ బస్సులను నడుపుతున్నారు. ఇక మన దేశంలో ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూరు వంటి పర్యాటక ప్రధాన నగరాల్లో కూడా ఇవి టూరిస్టులకు అందుబాటులో ఉన్నాయి. ఆల్రడీ విశాఖ(Vishaka)కు చేరుకున్న హోహో బస్సును, సింహాచలం ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహించే గోశాల దగ్గర ఉంచారు. ఈ బస్సును చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దాంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Double Decker Bus

భీమిలి బీచ్

ఈ హో హో బస్సులో రెండు అంతస్తులు ఉంటాయి. చుట్టూ అద్దాలు ఉంటాయి. కొన్నింటిలో ఓపెన్‌ టాప్‌(Open Top) ఉంటుంది. ఈ బస్సుల్లో టూరిస్టులు ఆర్కే బీచ్ నుంచి తెన్నేటి పార్క్‌, కైలాసగిరి, రుషికొండ మీదుగా తొట్లకొండకు చేరుకుని, అక్కడ నుంచి భీమిలి బీచ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చేలా రూట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సుల్లో గైడ్లు కూడా ఉంటారు. స్థానిక విశేషాలను టూరిస్టులకు వివరిస్తారు. అయితే ఈ బస్సులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు.

Read Also: AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు

#DoubleDeckerBus #ExploreVizag #HoHoBusVizag #VizagViews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.