📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Pawan Kalyan: ఉపాధి హామీ పనులు చేసే వారిని కూలీలు అనొద్దు : పవన్ కల్యాణ్

Author Icon By Anusha
Updated: April 24, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, ఉపాధి హామీ (నరేగా) పనులు చేసే వారిని “కూలీలు” అనడం సరైనది కాదని అన్నారు.ఇది మన సంస్కృతికి అనుకూలమైన పదం కాదని అన్నారు. నరేగా (ఉపాధి హామీ) శ్రామికులు, లేదా గ్రామీణ వికాస శ్రామికులు అని పిలవాలని సూచించారు. కూలీ అనేది బ్రిటిషర్స్ నుంచి వచ్చిందని గ్రామాభివృద్ధికి పాటు పడేవారు కూలీలు కాదన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ గ్రామాల అభివృద్ధితోపాటు అవినీతిని అరికట్టడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ కాలంలో గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూములపై సమీక్ష జరపాలని ఆదేశించారు.

పర్యటన

తనకు పల్లెలంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ అక్కడ ఉండే అవకాశం రాలేదని చెప్పారు. అయితే, పంచాయతీరాజ్ శాఖపై తాను ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిపారు. గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అధికారుల కృషితో గ్రామాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, గతంలో అనేక తండాల పర్యటనల సందర్భంగా అభివృద్ధికి దారులు వేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 75లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని చెప్పారు. జాతీయ సమైక్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలుండాలని అధికారులను ఆదేశించారు. 13 వేల 326 పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలన్నారు.

దిగ్భ్రాంతి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా కావలికి చేరింది. మధుసూదన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాసేపట్లో పవన్ కావలికి వెళ్లనున్నారు. మధుసూదన్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అమాయకులపై దాడులు అసహనంగా మారుతున్నాయని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Also: YSCP Suspension : పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానన్న దువ్వాడ శ్రీనివాస్

#EmploymentGuaranteeScheme #NoToCoolie #NREGA #PawanKalyan #RuralDevelopment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.