Diwakar Reddy : జగన్ తప్పు తెలుసుకోకపోతే ప్రజలు రోడ్లమీద తిరగనివ్వరు

Read Time:  1 min
Diwakar Reddy : జగన్ తప్పు తెలుసుకోకపోతే ప్రజలు రోడ్లమీద తిరగనివ్వరు
FONT SIZE
GET APP

తిరుపతి : రాష్ట్రప్రజలు గత ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి (Jagan mohan reddy) అవినీతి పాలనను చీత్కరించుకుని 11సీట్లకు పరిమితం చేసినా ఇప్పటికీ ఆయనకు బుద్దిరాలేని, తన వ్యవహారశైలిని మార్చుకోపోతే ప్రజలు రోడ్లపైకూడా తిరిగనివ్వరని తుడ చైర్మన్ సి. దివాకర్రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ళపాలనలో చేసిన పాపాలు ఊరికేపోవని అన్నారు. అవినీతి పరులను, దొంగలను, సంస్కారం లేని వ్యక్తులను వెనుకేసుకొచ్చే జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. గురువారం జగన్ నెల్లూరు పర్యటన, తదనంతరం పరిణామాలతో సంస్కారం లేకుండా పూనకం వచ్చినట్లు విసిగిచెంది వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సిఎం చంద్రబాబు పాలనదక్షత, పారదర్శకపాలన గురించి వైసిపికి ఏం తెలుసని వ్యంగ్యంగా విమర్శించారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో మీడియాప్రతినిధులతో తుడ ఛైర్మన్ దివాకర్రెడ్డి (Diwakar Reddy) మాట్లాడారు.

ఒక మహిళ ఎమ్మెల్యేని అసభ్యకరంగా మాట్లాడి వ్యక్తిగతంగా దూషించిన ప్రసన్నకుమార్ రెడ్డిని, ఒక తల్లిని అనరాని మాటలు అనిన వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ వెళ్ళడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్ళేమన్నా గాంధీ నెహ్రూలా అని ప్రశ్నించారు.

Diwakar Reddy

తన కారుక్రిందపడి మృతిచెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించలేని జగన్, అరెస్టయిన గంజాయి ముఠాలనాయకులను, రౌడీషీటర్లను, మదమెక్కి స్త్రీలను అవమానపరిచేలా మాట్లాడే సంస్కారం లేని నాయకులను పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. టీ దుకాణం నుండి మల్లీనేషనల్ కంపెనీల వరకు గత ఐదేళ్ళలో వైసిపి నాయకులు కలెక్షన్లు వసూలుచేశారని ఆరోపించారు. 2019 నుండి 2024వరకు ప్యాలస్లో కూర్చుని తెరల వెనుక పరిపాలన సాగించిన జగన్మోహన్రెడ్డికి రాష్ట్రాన్ని వేలకోట్ల రూపాయలు మద్యం స్కాం కుంభకోణంలో వాటాలు వేసుకుని వైసిపి నాయకులు పంచుకున్నారన్నారు.

VISIT TO : Hindi.vaartha.com

READ MORE :

https://vaartha.com/pension-restoration-of-1-20-lakh-pensions-removed-by-the-previous-government/andhra-pradesh/524704/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.