📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Yoga: ద్రాక్షారామ భీమేశ్వరుని సన్నిధిలో జిల్లా స్థాయి యోగా ఉత్సవం

Author Icon By Vanipushpa
Updated: June 9, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి సన్నిధిలో యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున జిల్లా స్థాయి యోగా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సుమారు 2500 మంది పాల్గొని చేసిన యోగ సాధనకు ద్రాక్షారామ వేదిక గా మారింది. సాంస్కృతిక వారసత్వంతో విరసిల్లే పవిత్ర క్షేత్రంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా వచ్చిన 2500 మందికి పైగా యోగా ప్రియులు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో యోగా కార్యక్రమాల్ని నిర్వహించి ప్రజలకు యోగా పై అవగాహన కల్పించాలనే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ద్రాక్షారామ లో ఈ యోగా శిబిరాన్ని నిర్వహించారు.
మొదట గా ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , పిఠాపురం శ్రీ పీఠికాపుర యోగా విద్యాపీఠం విద్యార్థులు చే యోగాసనాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కాట్రేనికోన మండలం , నల్లూరు ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమూహంగా ఏర్పడి వివిధ రకాల ఆసనాలు వేశారు.

Yoga: ద్రాక్షారామ భీమేశ్వరుని సన్నిధిలో జిల్లా స్థాయి యోగా ఉత్సవం

ప్రజలకు యోగా పై అవగాహన
అనంతరం ప్రముఖ యోగ గురువులు పి రామచంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న యోగ ప్రియులచే కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం సూక్ష్మ, స్థితిలీకరణ వ్యాయామాలు, ప్రాణాయామ వంటి వాటిని నిర్వహించారు.యోగ గురువులు పలు ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ, యోగా శరీర ఆరోగ్యానికి తోడు మానసిక శాంతికి మార్గదర్శకమని చెప్పారు. ప్రత్యేకించి నిత్యం 30 నిమిషాలు యోగా సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
కార్యక్రమం అనంతరం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ
నేటితరం యువత ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని ప్రతిరోజు అభ్యసించాలన్నారు.యోగా ఒక ప్రాచీన భారతీయ సంపదని ..దానిని తిరిగి మన జీవితం లోకి తీసుకురావడానికి, దేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగాంధ్ర అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యోగ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు యోగా పై అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించనున్న కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పాల్గొనేల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మానసిక ఒత్తిడిని జయించాలన్న, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్న యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. విద్యార్థి దశ నుండే యోగాను అభ్యసించాలని సూచించారు.

Yoga: ద్రాక్షారామ భీమేశ్వరుని సన్నిధిలో జిల్లా స్థాయి యోగా ఉత్సవం

యోగా సాధన ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు: కలెక్టర్
జిల్లా జాయింట్ టి నిషాంతి కలెక్టర్ మాట్లాడుతూ యోగాను ఒక రోజు నిర్వహించే కార్యక్రమంగా కాకుండా, ప్రతిరోజూ జీవనశైలిలో భాగంగా చేర్చుకోవాలన్నారు. శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో చేసిన యోగా ఉత్సవం మన సంస్కృతి, ఆరోగ్యం రెండు కలసి పోవడాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు యోగా సాధన ద్వారా ఒత్తిడిని అధిగమించి, ఉత్సాహంగా తమ బాధ్యతలు నిర్వహించగలరన్నారు.
‘ఆరోగ్య ఆంధ్ర’ సాకారత
యోగాంధ్ర–2025 అనేది ఒక చైతన్యాత్మక ఉద్యమం అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామసభల ద్వారా ప్రజల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టుతున్నానన్నారు. దీని వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం – ‘ఆరోగ్య ఆంధ్ర’ సాకారతని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి రాజకుమారి, రామచంద్రపురం ఆర్డీవో డి అఖిల, జిఎం ఇండస్ట్రీస్ పి ప్రసాద్, డిఎంహెచ్ఓ దుర్గారావు దొర, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, యువత, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read Also: Pawan: పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా:పవన్ కల్యాణ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu District level yoga festival Draksharama Bhimeshwara Google News in Telugu in the presence of Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.