విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యరంగంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) స్పష్టం చేసారు. క్షేత్రస్థాయి నుంచి బోధనాస్పత్రుల వరకు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందు తున్నాయన్నారు. వైద్యరంగంలో మందులకు కొరత లేదన్నారు. తరుణ వ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో విలేజీ క్లినిక్ నుంచి పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు అత్యాధునీక భవన వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అం దుబాటులో ఉన్నాయన్నారు.

డయేరియా పూర్తిగా అదుపులో
తురక పాలెంలో అనారోగ్య సమస్యలు. పలువురి మృతిగల కారణాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందన్నారు. అక్కడి ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నామన్నారు. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరి పేటలో డయేరియా పూర్తిగా అదుపులో ఉందన్నారు. ఈ ప్రాంతంలో తాను పర్యటించానన్నారు. రోగపీడితులందరికి వైద్య అందుతుందన్నారు. అక్కడ నీటి కాలుష్యం వలన డయేరియా ప్రబలలేదని ప్రాథమిక నివేదికలు తెలిపాయన్నారు. ఆయినా మళ్ళీ నీటి పరీక్షలు నిర్వహిస్తు న్నామన్నారు. డయేరియా వలన ఎవ్వరు మరణిం చలేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా (NTR Distt)నందిగామ దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 100 పడకల విస్తరణ కోసం భూమి పూజ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ పార్ల మెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) ఏపీ ప్రభుత్వ విప్, తంగిరాల సౌమ్యతో కలిసి చేసారు. శంకుస్థాపన శిలా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మిస్తుందన్నారు. గత సీఎం జగన్ మెడికల్ కళాశాల నిర్మిస్తామని ప్రకటించి, భవన వసతులు, ఇతర మోలిక సదుపాయాలు లేకుండా చేసారన్నారు. ఫలితంగా పలువురు విద్యార్ధులు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి తమ ప్రభుత్వం పిలిచిన టెండర్లు ఆపే దమ్ము జగన్కు లేదన్నారు.వైద్య రంగానికి సీఎం చంద్రబాబు పూర్తి స్దాయిలో ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అనతి కాలంలోనే నందిగామ హాస్పిటల్ అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు అనునిత్యం అభివృద్ధి కోసం తనతో చర్చలు జరుపుతారని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి శంకుస్థాపన 1998 సెప్టెంబర్ 10న జరిగిందని, ఆనాటి శాసనసభ్యులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ దూరదృష్టి మరియు ప్రజాసేవా భావనతో ఈ ప్రాజెక్ట్ మొదలైందని గుర్తు చేశారు.
డివిఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం మొదలు
దేవినేని ప్రయత్నాలతో డివిఆర్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నిర్మాణం మొదలైంది. కానీ, దురదృష్టవశాత్తు వారు మరణించిన తర్వాత, 1999 డిసెంబర్ 2న ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఆనాటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీనిని ప్రారం భించారని తెలియజేశారు. ముఖ్య అతిథిగా అప్పటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు హాజరయ్యారు అని ఆమె తెలిపారు. గత వైసీపీ పాలకుల రాక్షస పాలన కారణంగా 100 పడకల ఆసుపత్రి ప్రాజెక్ట్ అటకెక్కిందని, దానిని తిరిగి ఈ రోజు శంకుస్థాపన చేయడానికి ముఖ్యంగా సహకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశినేని శివనాద్ చిన్నికి పేరుపేరునా ధన్యవాదాల న్నారు. ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని మాట్లాడుతూ, తన సోదరి తంగిరాల సౌమ్య హాస్పిటల్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ఆమె అని నిత్యం అభివృద్ధికై తన ప్రజల యోగక్షే మాల కోసం పరితపిస్తారు. ఇటువంటి నేత ఉండటం అదృష్టం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, పిట్టల శ్రీదేవి, వివిధహోదాల్లోగల కూటమి నేతలు, ఆసుపత్రి అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హాస్పిటల్లో రాబోయే కాలంలో కావలసిన సదుపాయాలు, వస తులనిమిత్తం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లేఖతో కూడిన వినతి పత్రాలను మంత్రికి అందజేసారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: