📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Guntur: భార్యను అశ్లీల వీడియోలతో చిత్రహింసలకు గురి చేసిన కానిస్టేబుల్

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ హోంగార్డు తన భార్యను దారుణంగా హింసిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ అని నమ్మించి పెళ్లి చేసుకున్న నిందితుడు ఆ తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టడమే కాకుండా అశ్లీల వీడియోలు చూపిస్తూ శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు తల్లితో కలిసి నిన్న గుంటూరు(Guntur) పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేశారు.పూర్తి వివరాలు,పాత గుంటూరుకు చెందిన యువతి బీఎస్సీ చదివారు ఆమెకు 8 నెలల కిందట అలీనగర్‌(Alinagar)కు చెందిన హోంగార్డుతో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లికి ముందు తాను కానిస్టేబుల్ అని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లయ్యాక అతను హోంగార్డు అని తెలిసిందని,కొన్ని రోజులకు ఫణీంద్రకుమార్ మరో మహిళతో ఉన్న ఫోటో ఒకటి బాధితురాలి కంటపడింది. ఆ ఫోటో గురించి ఆరా తీస్తే తన భర్త మూడేళ్ల క్రితం పొత్తూరుకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలిసిందన్నారు. ఈ విషయం దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ

ఈ మోసం గురించి నిలదీయడంతో తనపై దాడికి పాల్పడ్డాడని, దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురిచేశాడని కన్నీళ్లు పెట్టింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ తీవ్రంగా హింసించేవాడని, కొన్నిసార్లు రక్తం వచ్చేలా గాయపరిచి, మూత్రం కూడా తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అతను ఇంట్లో లేని సమయంలో మామగారు అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ బాధలు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయాను. నా భర్తపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె పోలీసులను కోరింది. ఈ వేధింపుల వ్యవహారంపై పోలీసు అధికారులుప్రత్యేక విచారణకు ఆదేశించారు. భార్య ఆరోపణలపై హోంగార్డు స్పందించాల్సి ఉంది.

Read Also : Kandula Durgesh : జూన్ లో గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

#AndhraPradeshNews #CrimeAgainstWomen #DomesticViolence #HomeGuardAbuse Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.