📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Vamsi: వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ విధించిన కోర్టు

Author Icon By Vanipushpa
Updated: May 29, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఈరోజు నూజివీడు(Nuziveedu) కోర్టులో మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. వంశీని రెండోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ హనుమాన్(Hanuman) జంక్షన్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని విచారించినందున, మళ్లీ కస్టడీ అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వంశీ అస్వస్థతకు గురవడంతో విచారణ సరిగా జరగలేదని పోలీసులు వాదించినప్పటికీ, కోర్టు అంగీకరించలేదు.

Vamsi: వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ విధించిన కోర్టు

రిమాండ్ పొడిగింపు
అయితే, ఇదే కేసులో వంశీకి విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో, పోలీసులు ఆయనను వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వంశీ నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి వంశీ ముఖ్య అనుచరుడిగా భావిస్తున్న ఓలుపల్లి మోహన్ రంగాను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు రంగాను విజయవాడ జిల్లా జైలు నుంచి గన్నవరం ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

Read Also: Nadendla Manohar: ఆదివారం కూడా రేషన్ షాపులు ఓపెన్:మంత్రి నాదెండ్ల

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Court remands Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Vamsi till June 12

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.