Cordon And Search: చిత్తూరు జిల్లాలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్

Read Time:  1 min
Cordon And Search
Cordon And Search
FONT SIZE
GET APP

Cordon And Search: ప్రజల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని, నేరాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన కార్డన్ & సెర్చ్ నిర్వహణ. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో సమన్వయంగా విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్థుల కదలికలపై పర్యవేక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టబడినవి.

Read Also: National Medical Commission: TG, APలకు సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంపు

Cordon And Search

ఈరోజు జరిగిన కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో 10 ద్విచక్ర వాహనాలు మరియు 10 లీటర్ల ఐ డి సారాను సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం నేరాలను ముందస్తుగా అరికట్టి, ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని బలపరచడం. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే ఈ ఆపరేషన్‌ యొక్క ముఖ్య లక్ష్యం అని అధికారులు పేర్కొన్నారు.

ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసుల సహాయాన్ని పొందవచ్చని సూచించారు.

అదేవిధంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా హెల్మెట్ అవేర్‌నెస్ మరియు రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించబడినవి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు విభాగం సమన్వయం, స్థానిక ప్రజల సహకారం తో ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.