📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Cm: ప్రజలకు అందించే సేవల్లో రాజీపడనన్న సీఎం చంద్రబాబు

Author Icon By Anusha
Updated: May 20, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూన్ తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తాను

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుతున్న రేషన్, దీపం, ఏపీఎస్‌ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంవో కార్యదర్శులతో సమీక్షించారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం అన్నారు. లబ్ధిదారులు తమకు కావలసినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు, అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుందన్నారు.రేషన్ సరుకుల పంపిణీపై అభిప్రాయాలు పరిశీలిస్తే, “మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా?” అని ప్రశ్నించగా 74 శాతం మంది అవునని, వాటి నాణ్యత ఎలా ఉంది అంటే బాగుందని 76 శాతం మంది చెప్పారన్నారు. రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. అదే విధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే అంశంలో 62 శాతం మంది లేదని, పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని చెప్పారన్నారు. ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని, ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరిచేసుకోవాలని సీఎం సూచించారు.

AP Cm: ప్రజలకు అందించే సేవల్లో రాజీపడనన్న సీఎం చంద్రబాబు

పనితీరు

తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు . ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి, ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారని, గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడిచెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి, కంపోస్ట్ తయారీ చేపడతామని సీఎం తెలిపారు.ప్రభుత్వ సేవల్లో డాటా అనలిటిక్స్(Data Analytics) కీలకమని సీఎం అన్నారు. డాటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖలు తమ పనితీరును క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సమర్థవంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. ఒక ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న సందర్భంలో వాటికి కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రతి శాఖలో ఉన్నతాధికారులు ఆయా శాఖలపై వచ్చే డాటాపై అనలిటిక్స్ ద్వారా సేవలను మెరుగుపరచాలని సీఎం సూచించారు.

Read Also:   Ration: ఏపీలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

#AndhraPradesh #APGovernment #ChandrababuNaidu #DeepamScheme Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.