📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

CM Chandrababu: విశాఖలో యోగా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు

Author Icon By Anusha
Updated: June 16, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వయంగా సమీక్షించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ‘యోగాంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకుంది.విశాఖపట్నం బీచ్ రోడ్డు (Visakhapatnam Beach Road) లో యోగా ప్రాంగణాన్ని తయారు చేస్తుండగా, సీఎం చంద్రబాబు అక్కడి వేదిక, వసతుల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి యోగా దినోత్సవానికి సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి సమీక్షించారు.

ఈ నేపథ్యంలో

ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, “ప్రధాని మోదీ వచ్చేది చాలా గౌరవకరమైన విషయమని, విశాఖ ప్రతిష్టను మరింత పెంచే ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని” అధికారులకు సూచించారు.‘యోగాంధ్ర’ పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి  సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే, బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

CM Chandrababu

ఇబ్బందులు తలెత్తకుండా

607 సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరవుతున్నారని, వారిని సమన్వయం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా (Mock yoga) నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమం జరిగే రోజు ఉదయం 6:30 గంటల నుంచి 8:00 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

ట్రాఫిక్‌కు అంతరాయం

ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా సీఎం ఆరా తీశారు. ఆర్కే బీచ్‌లోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు వెళ్లి అక్కడ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Read Also: APSRTC: రాజమహేంద్రవరం నుండి అరుణాచలంకి ఏపీఎస్ఆర్టీసీ సేవలు

#ChandrababuNaidu #InternationalYogaDay #Visakhapatnam #YogaDay2025 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.