📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CM Chandrababu: రేపు సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ ప్రముఖుల భేటీ

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు, నిర్మాతలు, నటులు ఆదివారం సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాల మధ్య సినీ పరిశ్రమ నేతలు ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపడం చర్చనీయాంశంగా మారింది.తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలిసింది లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ను మాత్రమే కలిశారు. అయితే, ఇటీవల థియేటర్ల బంద్‌కు సంబంధించిన విషయంపై స్పందించిన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సినీ ప్రముఖులు ఒక్కసారైన సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని థియేటర్‌ల పరిస్థితిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేశారు.

భేటీకి ప్రాధాన్యం

అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) లను సినీ ప్రముఖులు కలవనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లయినా ఏపీలో అంతంత మాత్రంగానే సినీ ఇండస్ట్రీ ప్రభావం ఉంటుంది. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏమి కోరతారనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. చంద్రబాబు సూచన మేరకు సినీ ప్రముఖులకు మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ చేసి ఆహ్వానం పలికారు.

CM Chandrababu

అవకాశాలు

ఈ భేటీకి మొత్తం 35 నుంచి 40 మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రత్యేకంగా భేటీ కానున్నారు.అయితే సీఎం చంద్రబాబుతో కలిసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉండగా, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు ఉన్నారు. వీరితో పాటు నటులు బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని ఉన్నారు.

Read Also: AP School Students: ఏపీ విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్ పాస్‌లు

#ChandrababuNaidu #PawanKalyan #TollywoodMeetsCM #TollywoodNews Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.