📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

CM Chandrababu: నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు భేటీ

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు(CM Chandrababu). అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్‌(NITI Aayog) ఆర్ధిక ప్రణాళికలు రచిస్తోంది. అందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తిచేసిన నీతి ఆయోగ్‌ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8 జిల్లాలతో పాటు విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.అంతేకాదు విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ప్రత్యేక ప్రాధాన్యత

ఎకనమిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేయడం కోసం సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా పర్యావరణ అనుకూల విధానాలు రూపొందించాలని, మౌలిక వసతుల నిర్మాణానికి ప్రత్యేక నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌(Economic Region)కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ, లాజిస్టిక్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. సమీప జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి లాంటి ప్రాంతాలను కలుపుకుని ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

CM Chandrababu: నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు భేటీ

పలు ప్రాజెక్టుల

20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు పలు ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలన్నారు. ఇటు మూలపేట నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్య బీచ్ రోడ్లు(Beach roads)ను అభివృద్ధి చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 పోర్టులు, 17 వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌ను డెవలప్‌ చేయాలని నిర్దేశించారు. వచ్చే 7ఏళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా ముందుకెళ్తామన్నారు.

Read Also: Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ క్యాబినెట్ భేటీ

#AndhraPradeshDevelopment #ChandrababuNaidu #NITIAayog #ViksitBharat2047 #Visakhapatnam Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.