📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

ChintaMohan: చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమన్న చింతామోహన్

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్, తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కేవలం మాటల మనిషి మాత్రమేనని, ఆయన హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, అవినీతి వంటి పలు అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చింతా మోహన్ (ChintaMohan) పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. “మూడడుగుల గొయ్యి తీస్తేనే నీళ్లు వచ్చే ప్రాంతంలో 50 అంతస్తుల సచివాలయం కడతారా?” అని ఆయన ప్రశ్నించారు. అమరావతి దేవతల రాజధాని అనడం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎమ్మార్వో కార్యాలయంలో

చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే పేదరికాన్ని, మహిళలపై అత్యాచారాలను, దాడులను అరికట్టలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని చింతా మోహన్ నిలదీశారు. కుప్పంలో ప్రజలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “జీరో కరప్షన్ అంటున్న చంద్రబాబు (Chandrababu Naidu) పాలనలో ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో, పోలీస్ స్టేషన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారు” అని ఆయన తీవ్రంగా ఆరోపించారు.రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరకు ప్రాంతంలో మహిళల ముందే గిరిజన పురుషుల మర్మాంగాలను కోస్తున్నారని, కుప్పంలో ఓ నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారని ఆయన ఉదహరించారు.

ChintaMohan

చింతా మోహన్

ఇలాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. చంద్రబాబుకు బంధుప్రీతి ఎక్కువ” అని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) అంటే భయంతోనే ప్రజలు చంద్రబాబు నాయుడును గెలిపించారని, అంతేకానీ వికసిత ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు నిర్మించలేరని చింతా మోహన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకిగా మారారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, పది రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకునే దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. 

Read Also: Nara Lokesh: అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

#AmaravatiDebate #APPolitics #ChandrababuNaidu #ChintaMohan #PoliticalCriticism Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.