📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పెరుగుతున్న చికెన్ ధరలు

Author Icon By Anusha
Updated: March 2, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రభావం కారణంగా గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు భారీగా తగ్గాయి.ప్రజలు భయంతో చికెన్ కొనుగోళ్లకు దూరంగా ఉండటంతో మార్కెట్‌లో తీవ్ర నష్టం నెలకొంది. విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల్లో చికెన్ మార్కెట్లను బర్డ్ ఫ్లూ భయం వెంటాడింది. కొన్ని చోట్ల కోళ్లను నాశనం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

బర్డ్ ఫ్లూ ప్రభావం

తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రభావం తక్కువగానే ఉన్నా, హైదరాబాద్‌లోని ప్రజలు కూడా కొంతకాలం చికెన్ తినేందుకు వెనుకంజ వేశారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాకపోవడంతో, ప్రజలు మళ్లీ చికెన్ తినడం ప్రారంభించారు. ఆదివారం కావడంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది.గత 15 రోజులుగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న చికెన్ వ్యాపారులు మళ్లీ కోలుకుంటున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి తర్వాత చికెన్ సేల్స్ పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. వేసవి ప్రారంభం కావడంతో బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిందని, రాబోయే రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం

ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశముంది. హోటల్ రంగం, బకెట్ చికెన్ వ్యాపారులు మళ్లీ రికవరీలోకి వస్తారని ఆశిస్తున్నారు.

ఏపీలో చికెన్‌ ధరలు

విజయవాడలో కేజీ చికెన్ ధర 200 రూపాయలకు చేరింది. అంతక ముందు కేజీ చికెన్ ధర రూ.100 నుంచి రూ.150 పలకగా ప్రస్తుతం రూ.50 పెరిగి రూ.200లకు చేరింది. కాకినాడలో రూ.150 నుంచి రూ.170 మధ్య చికెన్ ధర పలుకుతోంది. ఈ ధరలు ఏపీలో రూ.250 వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.

హైదరాబాద్ లో చికెన్‌ ధరలు

హైదరాబాద్ లో నేటి చికెన్ ధరల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.180లుగా ఉంది. మొన్నటి వరకు రూ.120 నుంచి రూ.130 మధ్య పలికిన ఈ ధర రూ.50 పెరిగింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి. మటన్ ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఒక వారం క్రితం కిలో రూ.850లుగా ఉన్న మటన్ రేటు ప్రస్తుతం రూ.1000కు చేరుకుంది.

చేపల ధరలు

హైదరాబాద్ నగరంలో చేపల ధరలూ అదే ధోరణిలో పెరుగుతున్నాయి. కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు పెరుగుదల నమోదైంది.అకస్మాత్తుగా డిమాండ్ పెరగడంతో. వచ్చే రోజుల్లో మాంసాహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని.పరిస్థితిని బట్టి కొనుగోళ్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

#APChickenMarket #BirdFluImpact #ChickenLovers #ChickenPrices #FoodTrends #HyderabadChickenRates #MeatMarketUpdate #TelanganaMeatPrices #TeluguStatesChicken Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.