📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్

Author Icon By Anusha
Updated: May 8, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పర్యవేక్షకులతో సమావేశమై వారికి కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని అందిపుచ్చుకుని పార్టీని గెలిపించాలన్నారు. ప్రతి ప్రాంతీయ సమన్వయకర్త తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు.మీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని వస్తారనేదే మీకు నా పరీక్ష. ఆ మేరకు సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది’ అన్నారు జగన్. ఎమ్మెల్యే అభ్యర్థితో పార్టీ నేతలకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా ప్రాంతీయ సమన్వయకర్తలదే అన్నారు.చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని,ఆ సమయంలో తాను పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనిఅందుకే 2027లో మళ్లీ పాదయాత్ర చేస్తానన్నారు.

ప్రాధాన్యం

గత 11 నెలల్లో చంద్రబాబు పాలన చూసిన తర్వాత పార్టీ కార్యకర్తలు కూడా తన నుంచి ఆయన తరహా రాజకీయాలను ఆశిస్తున్నారని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూసి తనలో కూడా మార్పు వచ్చిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, జగన్ 2.0 వేరే విధంగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ కమిటీల నియామకం పూర్తయ్యేసరికి పార్టీలో 18 లక్షల మంది క్రియాశీల సభ్యులు ఉంటారన్నారు.వీరందరికీ ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వడంతోపాటు బీమా కూడా కల్పిస్తామన్నారు. అక్టోబరు తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీ శ్రేణులందరూ కష్టపడి పనిచేయాలని, వారి బాధ్యత తనదేనని జగన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ కమిటీ, బూత్ కమిటీ, మహిళా కమిటీలలో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

బూత్ కమిటీ

పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమైన నేతలకు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలన బాధ్యతలు అప్పగించామన్నారు జగన్. పార్టీ నిర్మాణంలో చురుగ్గా ఉండేవారిని, నడిపించగల వారిని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగపడే వారిని గుర్తించి ఈ బాధ్యతలు ఇచ్చామన్నారు. జిల్లా స్థాయి నుండి బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కొత్త జిల్లా అధ్యక్షులను నియమించి, వారికి సహాయంగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమించామన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనతో చెప్పే అవకాశం ఉందని.. గత 11 నెలలుగా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామన్నారు.

Read Also :Trilok Kumar : తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ బెదిరింపు కాల్

#APPolitics #Jagan2Point0 #JaganConfidence #YSRCP #YSRCPVictory Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.