Chandrababu Naidu: రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర గ్రహణం’!

Read Time:  1 min
A lunar eclipse for the Rayalaseema lift irrigation projects
A lunar eclipse for the Rayalaseema lift irrigation projects
FONT SIZE
GET APP

జూపాడుబంగ్లా (కర్నూలు) : కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ.. తడారిన గొంతులు
తడేపేందుకు.. తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం కుడి గట్టు కాల్వు కింద లక్షలాది ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభత్వ హాయంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం పట్టుకుందని వైకాపా నేతలు ఆరోపించారు. గురువారం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో భాగంగా పోతులపాడు సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సభకు వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితర వైకాపా ముఖ్యనేతలు హాజరయ్యారు.

Read also: Eggs Price : గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర

A lunar eclipse for the Rayalaseema lift irrigation projects

A lunar eclipse for the Rayalaseema lift irrigation projects

రాయల సీమ ఎత్తిపోతల పనులను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడంపై వైకాపా నేతలు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు మాట్లాడుతూ జగన్ హాయంలో ఈ పనులను రూ.3.707ల వ్యయంతో కాంట్రాక్టు అప్పగించి వేగవంతం చేయించారన్నారు. సీమ ఎత్తిపోతల పంజకం పూర్తైయితే జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తో ఎన్టీటిలో అప్పట్లో రిట్పిటీషన్ దాఖలు చేయించారని ఆరోపించారు, దీనిపై విచారించిన ఎన్జీటి, పర్యావరణ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఆదేశిందన్నారు. సిఎం చంద్రబాబు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని లిప్టు పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు.

సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా..

కావాలంటే తనికీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారన్నారు. తెలంగాణ సిఎం రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి.. కృష్ణా జరాలపై రాష్ట్రలను మళ్లీ తాకట్టు పెట్టారని వారు మండిపడ్డారు. ఈ చీకటి ఒప్పందం కుదరడం వల్లే పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈఎసి సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను బాబు సర్కార్ కావాలనే ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వ్యాఖ్యానించడం విడ్డూరంగా వుందన్నారు. గ్రేటర్ రాయలసీమ కోసం ఎత్తిపోతల పంజకం సాధించే వరకు వైయస్ఆర్సిపి పోరాటం కొనసాగిస్తుందని సమావేశాలలో స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్భాన్, మాజీ ఎంపిలు, పోదా బ్రహ్మనందరెడ్డి, గోరంట్ల మాదవ్, బుట్టారేణుక, అనంత వెంకట రామిరెడ్డి, మాజీ శాసన సభ్యులు డిఎల్ రవీంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగటి శ్రీదేవి, కేతిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేద్రనాంకరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అమర నాంజిరెడ్డి, ఐద్వేల్ ఎంఎల్ఎ డాక్టర్ వద్మ, ఎంఎల్సీ ఇసాక్ బాష, రాష్ట్ర యువజన విభాగం అధ ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జల్పా రవిచంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జ్ ధార సుధీర్, వైకాపా నాయకులు గంగుల ప్రభాకరరెడ్డి, శిల్పా రవి చంద్రారెడ్డి, బుద్దాశేషిరెడ్డి, జూపాడుబంగ్లా మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి తదితరుల పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.