📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu Naidu: అవినీతి రుజువైతే చర్యలు తప్పవన్న సీఎం చంద్రబాబు

Author Icon By Ramya
Updated: June 15, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముఖ్యమంత్రి ఆదేశాలు: అవినీతి నిర్మూలన, ప్రజా సంతృప్తికి ప్రాధాన్యత

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను ‘జీరో కరెప్షన్’ దిశగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి జరుగుతున్న చోట ప్రధానంగా దృష్టి సారించి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఉద్ఘాటించారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై ఉండవల్లిలోని (Undavalli) క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష (Review with superiors) నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లు ఐవీఆర్ఎస్, సీఎస్‌డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తిని పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలని సీఎం కోరారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ కింద అందించాలని ఆయన స్పష్టం చేశారు. వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదా కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Chandrababu Naidu

ప్రజాభిప్రాయ సేకరణలో కీలక అంశాలు

ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలలో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85% మంది (ఐవీఆర్ఎస్), 93.9% మంది (సీఎస్‌డీఎస్) అభిప్రాయపడ్డారు. ఇంటి దగ్గరే పింఛన్లు ఇస్తున్నారని 87.8% (ఐవీఆర్ఎస్), 93.3% (సీఎస్‌డీఎస్) మంది చెప్పారు. ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.9% (ఐవీఆర్ఎస్), 73.3% (సీఎస్‌డీఎస్) మంది వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5%, ఆహారం నాణ్యత బాగుందని 79.3%, సమయపాలన పాటిస్తున్నారని 80.8% మంది ఐవీఆర్ఎస్ ద్వారా చెప్పారు. ఆస్పత్రి సేవలు, రక్త పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, సిబ్బంది ప్రవర్తనపై గణనీయమైన సంతృప్తి వ్యక్తమైంది. మున్సిపాలిటీలో రోజూ చెత్త సేకరణపై 68.1% సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయాలలో సౌకర్యాలు, ప్రసాదం నాణ్యతపై భక్తులు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్, బస్సు సమయం-రూట్ వివరాలు, సిబ్బంది ప్రవర్తన, రక్షణపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. దీపం-2లో ఎక్కువ డబ్బు వసూళ్లు చేయడం లేదని 62.8% మంది, నెలనెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.1% మంది, వాటి నాణ్యత బాగుందని 73.8% మంది చెప్పారు. ఎరువుల లభ్యత ఉందని 60.9% మంది రైతులు, సమయానికి విత్తనాల సరఫరా జరిగిందని 63% మంది రైతులు తెలిపారు. డ్రగ్స్ సమస్య, పోలీసుల స్పందన, పబ్లిక్ ప్రాంతాల్లో వేధింపులు, పోలీసుల చర్యలపై కూడా అభిప్రాయాలు సేకరించారు. రిజిస్ట్రేషన్‌లో స్లాట్ బుకింగ్ ప్రాసెస్, అవినీతి లేకపోవడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లభ్యత, ధరపై కూడా ప్రజలు సంతృప్తి చెందారు. రెవెన్యూ సేవలు, పాస్‌బుక్ సర్వేలో ఎక్కువ మొత్తం తీసుకోలేదని ప్రజలు చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని 61.6%, పంచాయతీ చెత్త సేకరణ జరుగుతోందని 56.7% మంది తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆరోగ్య మిత్ర సాయంపై అత్యధిక సంతృప్తి, అవినీతి లేకపోవడంపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Read also: CM Chandrababu: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్న సీఎం చంద్రబాబు

#ChandraBabu2025 #Corruption_Free_AndhraPradesh #GoodGovernance #GovernanceWithTechnology #PeopleGovernance #SatisfactionInServices #TransparencyInGovernance #WelfareGoal #WhatsAppGovernance #ZeroCorruption Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.