📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu Naidu: కోనసీమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా మార్చడమే ముఖ్య ఉద్దేశంగా “పీ4” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో శనివారం జరిగిన పీ4 ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భగవంతుడు కరుణిస్తే పింఛను మొత్తాన్ని మరింత పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం భర్త చనిపోయిన మహిళలకు పింఛన్లు ఇవ్వలేదని, ఈ నెలలో కొత్తగా మొత్తం 71,380 మంది వితంతువులకు రూ.4 వేల చొప్పున పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. చెయ్యేరులో ఉపాధి పనులు జరిగే చోట లబ్ధిదారులకు చంద్రబాబు(Chandrababu పింఛను అందజేశారు. అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తామని, అన్ని ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు సేకరించి ఏఐతో అనుసంధానం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 94 పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తే, వాటిని వేరే వాటికి వాడటం వల్ల రాష్ట్రాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే పరిస్థితికి తెచ్చారని చంద్రబాబు విమర్శించారు.

భద్రపరుస్తామని

తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వాటా చెల్లించి 74 పథకాలను మళ్లీ ప్రారంభించామని చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు సేకరించి ఏఐ(AI)తో కలిపి వ్యాధులు రాకుండా, వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుంటామని సీఎం అన్నారు. దీని కోసం గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తామని, కుప్పంలో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టామని తెలిపారు. ఆ జిల్లాలో ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, డేటాను భద్రపరుస్తామని అన్నారు.గతంలో ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు వాడేశారని, రూ.7,500 కోట్లు తిరిగి వారికి చెల్లించామని తెలిపారు. “సూపర్‌ సిక్స్‌” హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ నెలలో అన్నదాతా సుఖీభవ పథకాన్ని(Annadaatha Sukhibava Scheme) అమలు చేస్తామని, పాఠశాలలు తెరిచేలోగా పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున “తల్లికి వందనం” ఇస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Chandrababu Naidu

అభివృద్ధి

కొందరు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజమండ్రిలో ఒక పాస్టర్ చనిపోతే, ఎవరో చంపారని బురద జల్లాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనది డేగకన్ను అని ఎవరు తప్పు చేసినా టెక్నాలజీ(Technology)తో కనిపెడతానని చంద్రబాబు హెచ్చరించారు.ఒకప్పుడు కోనసీమలో జీడీపీ బాగుండేదని, కరువు జిల్లా అనంతపురం వెనుకబడి ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కోనసీమ వెనుకబడి ఉందని, అనంతపురం అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. జూన్ 12 నుంచి పాలనలో మార్పులు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల గోదావరిలో స్నానానికి దిగి చనిపోయిన 8 మంది పిల్లల తల్లిదండ్రులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

Read Also: CM Chandrababu: రేషన్ పంపిణీపై కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు

#APDevelopment #ChandrababuNaidu #P4Initiative #PovertyFreeAP Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.