📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu: పార్టీకి చెడ్డపేరు తెస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు

Author Icon By Ramya
Updated: June 7, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజాప్రతినిధుల పనితీరు కీలకం: కూటమి పాలనలో కఠినంగా సీఎం చంద్రబాబు హెచ్చరిక

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థంగా చేరాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి Chandrababu నాయుడు గట్టి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు ప్రజల నమ్మకాన్ని పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కరాఖండిగా స్పష్టం చేశారు. తొలిసారి గెలిచిన శాసనసభ్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అతివిశ్వాసానికి పోతే తీవ్ర నష్టం తప్పదని హితవు పలికారు. పనితీరు బాగా లేకపోతే తప్పనిసరిగా మార్పులు చేస్తాం. పార్టీకి తలవంచే వారిని సహించేది లేదు’’ అని ఆయన హెచ్చరించారు.

విజయోత్సవాల నేపథ్యంలో సమీక్ష, తాజా కార్యక్రమాలపై దృష్టి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని, అదే రోజు అమరావతిలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వంతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరి పనితీరుపైనా తాను నిరంతరాయంగా సర్వేలు చేయిస్తున్నానని, ఎప్పటికప్పుడు సమాచారం సమీకరిస్తున్నానని Chandrababu తేల్చిచెప్పారు. “మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది నా ఆకాంక్ష. అధికారంలో ఉన్న మనల్ని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. కాబట్టి, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

పనితీరు సర్వేలు – ప్రతికూల ఫలితాలైతే ఖచ్చితమైన చర్యలు

ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకుంటానని, మెరుగైన పనితీరు కనబరిస్తే అభినందించి, మరిన్ని అవకాశాలు కల్పిస్తానని, లోపాలుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. “వ్యవస్థకు నష్టం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించను. మెజారిటీ ప్రజాప్రతినిధులు తమ పనితీరుతో ప్రజలకు చేరువయ్యారు. అయితే, కొందరి వల్ల నష్టం వాటిల్లుతోంది. త్వరలోనే ప్రతి ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా సమావేశమవుతాను,” అని సీఎం పేర్కొన్నారు.

అభివృద్ధి పథకాలపై దృష్టి – ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు, సాయంత్రం అమరావతిలో సమీక్ష ఉంటుందన్నారు. “గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయింది. ఏడాదిలోనే మనం స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి,” అని సూచించారు. ఈ నెల 12 లేదా 14లోగా ‘తల్లికి వందనం’, ఈ నెలలోనే ‘అన్నదాత’, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులిచ్చామని, 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని, పోలవరం – బనకచర్ల అనుసంధానంతో తెలంగాణకు నష్టం లేదని స్పష్టం చేశారు.

Read also: Ration Distribution : వారం రోజుల్లోనే కోటి మందికి రేష‌న్ పంపిణీ – మంత్రి నాదెండ్ల

#AndhraPragatiBhavishyat #AnnaDataPhagam #Chandrababu #CoalitionGovernment #FreeBusService #NDACoalition #PerformanceofPublicRepresentatives #Polavaram2027 #SalutetoMother #VictoryRallies Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.