వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు ఆమె భర్త బుట్టా నీలకంఠం 2018లో ఎల్‌ఐసీకి అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్) నుంచి భారీగా రూ. 310 కోట్ల రుణాన్ని పొందారు. ఈ మొత్తాన్ని బుట్టా గ్రూప్‌కు చెందిన మూడు సంస్థల కార్యకలాపాల కోసం వినియోగించారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మరియు మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్.
రుణ చెల్లింపుల్లో విఫలం
ప్రారంభంలో కొంతకాలం వీరు వాయిదాలను సమర్థవంతంగా చెల్లించారు. మొదటి ఐదేళ్లలో దాదాపు రూ. 40 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. అయితే అనంతరం వారు చెల్లింపులను నిలిపేశారు. వడ్డీ సహా మిగిలిన మొత్తం ప్రస్తుతం దాదాపు రూ. 340 కోట్లకు పెరిగింది. వడ్డీ భారం అధికమవడం, ఆర్థిక ఇబ్బందులు రావడం వంటి కారణాలు చెల్లింపుల నిలుపుకు దారి తీశాయి. రేణుక-నీలకంఠం దంపతులు కొన్ని ఆస్తులను విక్రయించి రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థించారు. తక్కువ వడ్డీ రేటుతో నెలవారీ వాయిదాలను తగ్గించుకోవాలని, తర్వాత వాయిదాలను పెంచాలని ప్రతిపాదించారు. అయితే, ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ రుణ నిబంధనలకు విరుద్ధమైన ఈ అభ్యర్థనను తిరస్కరించింది. దీనివల్ల పరిస్థితి మరింత సంక్లిష్టమైంది.
న్యాయపరమైన చర్యలు
వాయిదాల చెల్లింపులు నిలిచిపోయిన నేపథ్యంలో, ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)ను ఆశ్రయించింది. కేసు ప్రస్తుతం ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది.
వేలంలో ఎదురైన సమస్యలు
ఈ కేసు నేపథ్యంగా రేణుక-నీలకంఠం దంపతుల ఆస్తులపై ఇప్పటికే రెండు సార్లు వేలం ప్రకటనలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉండగా లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని 5 వేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేశారు. కానీ ఎవరూ ముందుకు వచ్చి వేలంలో పాల్గొనలేదు. అలానే మాదాపూర్‌లోని 7,205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ కూడా వేలం వేయగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో తాజాగా మూడోసారి వేలం ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Read also: AP Liquor Scam: ఏపీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక వ్యక్తి అరెస్ట్