हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Buddhaprasad-సభకు రాకుండా సంతకాలు చేసి సర్దుకోవడమా: బుద్ధప్రసాద్

Sharanya
News telugu: Buddhaprasad-సభకు రాకుండా సంతకాలు చేసి సర్దుకోవడమా: బుద్ధప్రసాద్

విజయవాడ: ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు శాసనసభకు హాజరుకాకుండా కేవలం సంతకాలు చేసి సర్దుకోవడం ఏం సభ్యత, సంస్కారం అని నైతిక విలువల(Ethics) కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మండలి బుద్దప్రసాద్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన శాసనసభ నైతిక విలువల కమిటీ సభ్యులు వివిధ అంశాలను కీలకంగా చర్చించారు. జీతభత్యాలతో పాటు ప్రొటోకాల్ మర్యాదలు పొందుతూ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది.

News telugu
News telugu

ఎథిక్స్ కమిటీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించడంపై చర్చ జరగాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు సభకు వచ్చి చట్టాల నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందేనని శాసనసభ నైతిక విలువల కమిటీ స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల నైతిక ప్రవర్తన ప్రాధాన్యతను పెంచడంలో ఎథిక్స్ కమిటీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని కమిటీ ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. వైఎస్సార్సీపీ (YSRCP)ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవడం నైతికత ఎలా అవుతుందనే అంశాన్ని కమిటీ సభ్యులు లేవనెత్తారు. తమను ఎన్నుకున్న ప్రజలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత సమస్యలను శాసనసభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి పాటుపడాలని హితవు పలికారు. సభకు రాకుండా ఈ బాధ్యతను విస్మరించడం అనైతికమే అవుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సభకు రాకపోవడం అనైతికమే, తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని కమిటీ తరపున విజప్తి చేద్దామనే అభిప్రాయాన్ని కొందరు సభ్యులు వ్యక్తం చేశారు. ఎవరెవరు జీతభత్యాలు తీసుకుంటున్నారు, ఎవరెవరు సభకు రాకుండా బయట రిజిస్టర్లో సంతకాలు చేసి వెళుతున్నారనేదీ రికార్డులను పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని ఇతర సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో వచ్చే సమావేశం నాటికి ఈ రికార్డులను కమిటీ ముందుంచాలని ఛైర్మన్ బుద్ధప్రసాద్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870