📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Bengaluru-Chennai: బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్ హైవే

Author Icon By Shiva
Updated: October 6, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడును అనుసంధానం చేస్తూ నిర్మాణం జరుగుతున్న బెంగళూరు-చెన్నై(Bengaluru-Chennai) ఎక్స్ ప్రెస్ హైవే దాదాపు తుది దశకు వచ్చింది. అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ఈ హైవే అందుబాటులోకి వస్తే ఈ చిత్తూరు జిల్లావాసులు గంటన్నరలోనే బెంగళూరు లేదా చెన్నై చేరుకునే వీలుంటుంది. వి.కోట ప్రాంతం నుంచి అయితే కేవలం గంటలోనే బెంగళూరు చేరుకోవడం సాధ్యమవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 120 కి.మీగా నిర్ధారించిన ఈ రహదారి, రాష్ట్రాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి దోహదమవుతుందని అధికారులు చెబుతున్నారు.

గురుకులంలో కామెర్ల కలకలం.. ఇద్దరు విద్యార్థులు మృతి

చిత్తూరు జిల్లాకు వాణిజ్య అవకాశాల పుంజం

రాష్ట్రంలో మొత్తం 65 కి.మీ. మేర ఈ హైవే చిత్తూరు జిల్లా మీదుగా వెళ్తుంది. ఈ మార్గం పూర్తయితే చిత్తూరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాలకు పరిశ్రమలు, రవాణా రంగాల్లో పెద్ద అవకాశాలు లభించనున్నాయి. రహదారి నిర్మాణం పూర్తయ్యాక బెంగళూరు నుంచి చెన్నై మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం 6 గంటల నుంచి 1.5 గంటలకు తగ్గనుంది. ఇది దక్షిణ భారత వాణిజ్యానికి కీలకంగా మారనుందనే అంచనాలు ఉన్నాయి.

పరిశ్రమలు, పర్యాటకానికి ఊపునిచ్చే ఎక్స్ ప్రెస్ హైవే

ఈ ఎక్స్ ప్రెస్ హైవే పూర్తయితే, బెంగళూరు-చెన్నై(Bengaluru-Chennai) మధ్య ప్రయాణ సమయం 75 తగ్గుతుంది. చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతమవుతుంది. రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. బెంగళూరు, చెన్నైకి వాణిజ్యం సులభం అవుతుంది. పర్యాటకం, పెట్టుబడులు పెరగడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం లభిస్తుంది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లా కేంద్రంగా దక్షిణ భారత పరిశ్రమలకు కొత్త కారిడార్గా ఎదగనుందనే అంచనాలు ఉన్నాయి.ప్రాజెక్టు అధికారులు వచ్చే ఏడాది చివరి నాటికి హైవేను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారిపై వాహనాలు గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ హైవే కర్ణాటక పరిధిలో హుస్కేట నుంచి సుందరపాళ్య వరకు 91 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారి ఇప్పటికే పూర్తి అయింది. ఈ విభాగంలో వాహన రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం సుందరపాళ్య నుంచి తమిళనాడు సరిహద్దు గుడిపాల వరకు పనులు చురుకుగా సాగుతున్నాయి.

చిత్తూరు జిల్లా పరిధిలోని బైరెడ్డిపల్లె, చీలాపల్లె, బలిజపల్లె వద్ద లింకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ లింకు రోడ్లతో సమీప గ్రామాలు, పట్టణాలు ప్రధాన రహదారితో నేరుగా అనుసంధానం కానున్నాయి. ప్రస్తుతం హైవే నాలుగు వరుసలుగా నిర్మాణం జరుగుతున్నా, రాబోయే సంవత్సరాల్లో ట్రాఫిక్ పెరుగుదల దృష్ట్యా ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కేంద్రం ఆధ్వర్యంలో దశలవారీ అభివృద్ధి

కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు మొత్తం దశలవారీగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో చిత్తూరు జిల్లాలోని లింకు రహదారులను విస్తరించడమే కాకుండా, ఇంటర్చేంజ్లు, ఓవర్పాసులు, సర్వీస్ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. బెంగళూరు- చెన్నై హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ ఎక్సీ ప్రెస్ హైవే (ఎన్హెచ్7) కుప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2022లో శంకుస్థాపన చేసారు. నిర్మాణానికి అంచనా వ్యయం: రూ.17,980 కోట్లుగా గుర్తించారు.

Read Also:

Andhra Pradesh AP News Ap News in Telugu bengaluru Bengaluru-Chennai Expressway Chennai Chittoor district Latest ap news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.