📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Belum Caves: ఆంద్రా బెలూం గుహలకు GSI గుర్తింపు

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) అధికారిక గుర్తింపు ఇచ్చింది. భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా బెలూం గుహలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే ఇవి గుర్తింపు పొందాయి. ఈ గుహలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.దేశంలోనే అత్యంత పొడవైన గుహలుగా ఇప్పటికే బెలూంగుహలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.

దేశంలోనే పొడవైన

అయితే తాజాగా ఈ గుహలకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు ఇవ్వడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలూం గుహలు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ప్రసిద్ధి చెందిన బెలూం గుహలను ఎట్టకేలకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇవ్వడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచలో రెండోది, దేశంలోనే పొడవైన గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి చెందాయన్నారు. దేశ పర్యాటక ప్రదేశాల్లో రాష్ట్రంలోని బెలూం గుహలకు ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా బెలూం గుహలపై మరింత ప్రచారం కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

లక్షల మంది

ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఈ గుహలు ఉన్నాయి. దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు (Belum Caves) ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. తాజాగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(GSI) అధికారిక గుర్తింపు ఇవ్వడంపై రాష్ట్ర ప్రతినిధులతోపాటు నంద్యాల జిల్లా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Belum Caves

బెలూం గుహలకు

బెలూం గుహలకు ”భౌగోళిక వారసత్వ” గుర్తింపుపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Janardhan Reddy) హర్షం వ్యక్తం చేశారు. భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందకరమన్నారు. దేశ పర్యాటక ప్రదేశాల పటంలో మన బనగానపల్లె నియోజకవర్గంలో కొలువైన బెలూం గుహలకు స్థానం దక్కడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద, దేశంలో పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందిన బెలూం గుహలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

అభివృద్ధి చేయడం

ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవైన ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్​ (Tourism Hub) గా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు వచ్చే బెలూం గుహలు అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. క్రీ.పూ 450 ఏళ్ల కిందటి ఈ పురాతన గుహలకు పర్యాటకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా టూరిజం శాఖ ద్వారా బెలూం గుహలకు మరింత ప్రచారం కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: Srisailam Dam : శ్రీశైలానికి భారీ వరద

#BelumCaves #GeologicalHeritage #GSIIndia #NaturalWondersOfIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.